iDreamPost

17 ఏళ్లలో ఒకే ఒక్కడిగా కోహ్లీ.. టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు!

  • Published Jun 04, 2024 | 12:14 PMUpdated Jun 04, 2024 | 12:14 PM

వరల్డ్ కప్ అంటే చాలు శివాలెత్తిపోతాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. 17 ఏళ్లలో ఒకే ఒక్కడిగా నిలిచాడు కింగ్. అతడి రికార్డును టచ్ చేయడం ఎవరి వల్లా కాదు.

వరల్డ్ కప్ అంటే చాలు శివాలెత్తిపోతాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. 17 ఏళ్లలో ఒకే ఒక్కడిగా నిలిచాడు కింగ్. అతడి రికార్డును టచ్ చేయడం ఎవరి వల్లా కాదు.

  • Published Jun 04, 2024 | 12:14 PMUpdated Jun 04, 2024 | 12:14 PM
17 ఏళ్లలో ఒకే ఒక్కడిగా కోహ్లీ.. టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు!

విరాట్ కోహ్లీ.. మామూలు టోర్నమెంట్లలోనే రెచ్చిపోయే ఆడే ఆటగాడు. ప్రతి మ్యాచ్​లో తన వంద శాతం ఇవ్వాలని పరితపించిపోతుంటాడు. జట్టును గెలుపు తీరాలకు చేర్చే దాకా విశ్రమించడు. ఓటమిని ఒప్పుకోని తత్వం అతడిది. ద్వైపాక్షిక టోర్నీల్లోనే విధ్వంసం సృష్టించే కింగ్ కోహ్లీ.. ఇక ఐసీసీ టోర్నమెంట్స్​ను వదులుతాడా? ఒత్తిడిలో ఆడటానికి అందరూ భయపడతారు. కానీ విరాట్ మాత్రం ప్రెజర్ సిచ్యువేషన్​లోనే తనలోని రియల్ టాలెంట్​ను బయటకు తీసుకొస్తాడు. తీవ్ర ఒత్తిడి ఉండే వరల్డ్ కప్స్​లో తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. టీ20 ప్రపంచ కప్​లోనూ అతడు ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్​లు ఆడాడు. తన అద్భుతమైన బ్యాటింగ్​తో 17 ఏళ్ల పొట్టి కప్పు హిస్టరీలో ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్​గా నిలిచాడు కోహ్లీ. ఆ రికార్డును దాటడం ఎవరి వల్లా కాదు.

టీ20 వరల్డ్ కప్​లో ఇప్పటిదాకా ఎందరో తోపు ప్లేయర్లు ఆడారు. విధ్వంసక ఇన్నింగ్స్​లతో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు. చాలా జట్లు ఛాంపియన్స్​గా నిలిచాయి. అయితే ఫైనల్ రిజల్ట్స్​తో సంబంధం లేకుండా ఒకే ఒక్కడికి ప్లేయర్ ఆఫ్​ ది సిరీస్ రూపంలో అవార్డు దక్కుతోంది. ఇప్పటిదాకా 8 సార్లు టీ20 వరల్డ్ కప్స్ జరిగాయి. ఇప్పుడు జరుగుతోంది తొమ్మిదో ఎడిషన్. పొట్టి కప్పు హిస్టరీలో మూడుసార్లు మాత్రమే విజేత జట్టు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం అందుకున్నారు. టీమిండియా నుంచి ఈ ఘనత అందుకుంది విరాట్ కోహ్లీ ఒక్కడే. అతడు రెండుమార్లు ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంకే భారత ఆటగాడికి కూడా ఈ ఘనత సాధించలేదు. టీ20 వరల్డ్ కప్​ హిస్టరీలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం అందుకున్న ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీనే కావడం మరో విశేషం.

టీ20 ప్రపంచ కప్-2014లో తొలిసారి ప్లేయర్ ఆఫ్​ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు కోహ్లీ. ఆ ఏడాది ఫైనల్​లో శ్రీలంక చేతుల్లో ఓడి రన్నరప్​గా నిలిచింది భారత్. టోర్నీ ఆసాంతం రాణించిన కింగ్.. నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 319 పరుగులతో టాప్ స్కోరర్​గా నిలిచాడు. 2016లో స్వదేశంలో జరిగిన పొట్టి కప్పులోనూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్​ను సొంతం చేసుకున్నాడు కోహ్లీ. ఆ ఏడాది మూడు హాఫ్ సెంచరీలతో 273 పరుగులు చేశాడు. అయితే విరాట్ రాణించినా సెమీస్​లో విండీస్ చేతుల్లో ఓడి టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించింది. ఇప్పుడు సూపర్ ఫామ్​లో ఉన్న కింగ్.. వరల్డ్ కప్ కోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. అతడు ఉన్న ఊపులో ఈసారి కూడా ప్లేయర్ ఆఫ్​ ది సిరీస్​ను ఎగరేసుకుపోయేలా కనిపిస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే ఆ ఫీట్ అందుకున్న ఏకైక ఆటగాడిగా అతడు చరిత్ర సృష్టిస్తాడు. మరి.. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సాధిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి