iDreamPost

సూపర్ 8 మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ కు గాయం..

టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ లో భాగంగా స్టార్ ప్లేయర్ చేతికి గాయం అయ్యింది. దాంతో కీలకమైన సూపర్ 8 తొలి మ్యాచ్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బతగిలింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ లో భాగంగా స్టార్ ప్లేయర్ చేతికి గాయం అయ్యింది. దాంతో కీలకమైన సూపర్ 8 తొలి మ్యాచ్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బతగిలింది. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ 8 మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ కు గాయం..

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అదరగొడుతోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయాలు సాధించి.. సూపర్ 8కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక కెనడాతో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దాంతో భారత ఆటగాళ్లకు ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఇక లాంగ్ గ్యాప్ రావడంతో.. ప్లేయర్లు వాలీబాల్ ఆడుతూ సేదతీరుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ లో భాగంగా స్టార్ ప్లేయర్ చేతికి గాయం అయ్యింది. దాంతో కీలకమైన సూపర్ 8 తొలి మ్యాచ్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బతగిలింది.

టీ20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో సూపర్ 8కు దూసుకొచ్చిన టీమిండియాకు అనుకోని విధంగా ఎదురుదెబ్బతగిలింది. సూపర్ 8లో భాగంగా జూన్ 20న ఆఫ్గానిస్తాన్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా అతడు గాయపడినట్లు తెలుస్తోంది. త్రోడౌన్స్ కు బ్యాటింగ్ సాధన చేస్తుండగా.. ఓ బంతి వచ్చి సూర్య మణికట్టుకు తగిలింది. దాంతో నొప్పితో అతడు బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అనంతరం కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు.

India

అయితే ఈ గాయం చిన్నదా? పెద్దదా? అన్న విషయం గురించి మేనేజ్ మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. గాయం తీవ్రత ఎలాంటిదో తెలియాల్సి ఉంది. మ్యాచ్ కు ఒక్కరోజే టైమ్ ఉండటం, సూర్యకు గాయం అవ్వడంతో టీమిండియా ఫ్యాన్స్ లో ఆందోళన రేకెత్తుతోంది. సూపర్ 8లో భాగంగా తన తొలి మ్యాచ్ ను జూన్ 20న ఆఫ్గానిస్తాన్ తో బార్బడోస్ వేదికగా ఆడనుంది టీమిండియా. ఇక తన చివరి మ్యాచ్ లో అమెరికాపై సూపర్ ఫిఫ్టీతో అదరగొట్టాడు సూర్య భాయ్. ఇక అతడికి తగిలిన గాయం పెద్దది కాకూడదని, చిన్న గాయం నుంచి త్వరగా కోలుకోవాలని  అభిమానులు ప్రార్థిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి