iDreamPost
android-app
ios-app

IND vs AFG: తొలి మ్యాచ్ లోనే టీమిండియాకు డేంజర్ బెల్స్! భయపెడుతున్న ఆ రికార్డు..

  • Published Jun 20, 2024 | 7:35 AM Updated Updated Jun 20, 2024 | 7:35 AM

టీ20 వరల్డ్ కప్ లో తొలి సూపర్ 8 పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఈ పోరులో ఆఫ్గాన్ ను ఢీకొనబోతోంది భారత్. ఈ నేపథ్యంలో టీమిండియాను ఓ రికార్డ్ భయపెడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో తొలి సూపర్ 8 పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఈ పోరులో ఆఫ్గాన్ ను ఢీకొనబోతోంది భారత్. ఈ నేపథ్యంలో టీమిండియాను ఓ రికార్డ్ భయపెడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs AFG: తొలి మ్యాచ్ లోనే టీమిండియాకు డేంజర్ బెల్స్! భయపెడుతున్న ఆ రికార్డు..

టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో సూపర్ 8 కు దూసుకొచ్చిన టీమిండియా.. కీలక సమరానికి సిద్ధమైంది. సూపర్ 8లో భాగంగా ఈరోజు(జూన్ 20, గురువారం) ఆఫ్గానిస్తాన్ ను ఢీ కొనబోతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ రికార్డు భారత్ ను భయపెడుతోంది. ఇది ఇటు టీమిండియాతో పాటుగా అభిమానులను టెన్షన్ కు గురిచేస్తోంది. మరి టీమిండియాను భయపెడుతున్న ఆ రికార్డు ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం పదండి.

టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి. ఇక ఈ స్టేజ్ లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది సౌతాఫ్రికా టీమ్. అమెరికాతో జరిగిన సూపర్ 8 పోరులో 18 పరుగుల తేడాతో సఫారీ టీమ్ విజయం సాధించింది. టీమిండియా కూడా సూపర్ 8లో తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఆఫ్గానిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి.. లీగ్ దశలో చూపించిన జోరును కంటిన్యూ చేయాలని భావిస్తోంది. అయితే ఆఫ్గాన్ తో జరిగే మ్యాచ్ కి.. టీమిండియాను ఓ విషయం భయపెడుతోంది. అదేంటంటే?

ఇండియా వర్సెస్ ఆఫ్గాన్ మ్యాచ్ కు బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తోంది. ఇదే ఇప్పుడు భారత జట్టును టెన్షన్ పెడుతోంది. ఈ మైదానంలో టీమిండియా చెత్త రికార్డు ఉంది. ఈ గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ లో కూడా గెలవలేదు టీమిండియా. ఈ మైదానంలో కేవలం రెండు టీ20 మ్యాచ్ లే ఆడినప్పటికీ.. రెండింటిలో కూడా ఓడిపోయింది. 2010లో ఆస్ట్రేలియాతో ఆడిన టీ20 మ్యాచ్ లో 49 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఇక అదే సంవత్సరం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కూడా టీమిండియా 14 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. ఇప్పుడు మళ్లీ 14 ఏళ్లకు ఈ గ్రౌండ్ లో ఆడుతుండటంతో.. ఆ చెత్త రికార్డ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఇది టీమిండియాకు డేంజర్ బెల్ లాంటిదే అని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆఫ్గానిస్తాన్ తో ఆడిన 8 మ్యాచ్ ల్లో టీమిండియా 7 మ్యాచ్ ల్లో విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇది ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం.