iDreamPost

టీమిండియాకు అతడే ఎక్స్​ఫ్యాక్టర్.. వరల్డ్ కప్​ అందిస్తాడు: రైనా

  • Published May 31, 2024 | 8:31 PMUpdated May 31, 2024 | 8:31 PM

టీ20 ప్రపంచ కప్-2024​ కోసం రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి కప్పును సొంతం చేసుకోవాలని చూస్తోంది.

టీ20 ప్రపంచ కప్-2024​ కోసం రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి కప్పును సొంతం చేసుకోవాలని చూస్తోంది.

  • Published May 31, 2024 | 8:31 PMUpdated May 31, 2024 | 8:31 PM
టీమిండియాకు అతడే ఎక్స్​ఫ్యాక్టర్.. వరల్డ్ కప్​ అందిస్తాడు: రైనా

టీ20 ప్రపంచ కప్-2024​ కోసం రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి కప్పును సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న మెన్ ఇన్ బ్లూ.. ప్రాక్టీస్​లో మునిగిపోయారు. కప్పు కోసం కసిగా సాధన చేస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని భావిస్తున్నారు. తమ మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోవాలని అనుకుంటున్నారు. ఈసారి భారత్ కప్పు నెగ్గుతుందని ఫ్యాన్సే కాదు.. క్రికెట్ ఎక్స్​పర్ట్స్, లెజెండరీ ప్లేయర్స్ కూడా ప్రిడిక్షన్ చెబుతున్నారు. కప్పు కొట్టకుండా రోహిత్ సేనను ఎవరూ ఆపలేరని అంటున్నారు. అందుకు తగ్గట్లే టీమ్ కూడా చాలా స్ట్రాంగ్​గా కనిపిస్తోంది. ప్రతి పొజిషన్​కు జట్టులో ఒకటికి మించిన ఆప్షన్స్ ఉన్నాయి.

ఓపెనర్ల దగ్గర నుంచి బౌలర్ల వరకు ప్రతి స్థానానికి ఆప్షన్స్ ఉండటంతో తుది కూర్పు ఆసక్తికరంగా మారింది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​లో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఆల్​రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రవీంద్ర జడేజా జట్టులో ఉన్నారు. ముగ్గురిలో ఏ ఇద్దరినో తీసుకోవాల్సి ఉంటుంది. పేస్ ఆల్​రౌండర్లు ఇద్దరు కావాలనుకుంటే దూబె, పాండ్యాలు ఆడతారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దూబేను బరిలోకి దించాల్సిందేనని పట్టుబట్టాడు. టీమిండియాకు అతడు ఎక్స్​ఫ్యాక్టర్ అని చెప్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. ఈసారి వరల్డ్ కప్​ను అందించేది దూబేనే అని విశ్వాసం వ్యక్తం చేశాడు.

‘వరల్డ్ కప్​లో శివమ్ దూబేను తప్పకుండా ఆడించాలి. అలవోకగా భారీ సిక్సులు కొట్టే సామర్థ్యం ఉన్న ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదు. మెగా టోర్నీలో భారత జట్టుకు దూబె ఎక్స్​ఫ్యాక్టర్ కాగలడు. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ అతడ్ని ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోవాలి. ఒకవేళ విరాట్ కోహ్లీని ఓపెనర్​గా దింపాలనుకుంటే తప్పు లేదు. కానీ యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదే పొజిషన్​లో దుమ్మురేపుతున్నాడు. దూబేనైతే టీమ్​లోకి తీసుకోవాల్సిందే. అతడు అవసరమైతే బాల్​తోనూ మెరుపులు మెరిపించగలడు’ అని రైనా చెప్పుకొచ్చాడు. దూబేపై రైనా ఇంతగా విశ్వాసం వ్యక్తం చేయడానికి ఓ కారణం ఉంది. అదే ఐపీఎల్-2024లో అతడి పెర్ఫార్మెన్స్. ఈ సీజన్​లో 162 స్ట్రైక్ రేట్​తో 396 పరుగులు చేశాడు దూబె. ఈ మధ్య కాలంలో టీమిండియా తరఫున టీ20ల్లోనూ అదరగొడుతున్నాడు. అందుకే అతడ్ని జట్టులోకి తీసుకోవాలని రైనా అంటున్నాడు. మరి.. దూబేను టీమ్​లోకి తీసుకోవాలనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి