iDreamPost
android-app
ios-app

Rohit Sharma: వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. అప్పుడు రితికాను ఆ మాట అడిగా: రోహిత్ శర్మ

  • Published Jun 06, 2024 | 4:11 PM Updated Updated Jun 06, 2024 | 4:11 PM

వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత తన భార్య రితికా సజ్దేతో మాట్లాడిన మాటలను తాజాగా రివీల్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ ఇంట్రెస్టింగ్ వివరాల్లోకి వెళితే..

వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత తన భార్య రితికా సజ్దేతో మాట్లాడిన మాటలను తాజాగా రివీల్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ ఇంట్రెస్టింగ్ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 06, 2024 | 4:11 PMUpdated Jun 06, 2024 | 4:11 PM
Rohit Sharma: వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. అప్పుడు రితికాను ఆ మాట అడిగా: రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లు అనిపిస్తోంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను చిత్తు చేసి సత్తా చాటింది. ఇక ఈ మ్యాచ్ లో సూపర్ ఫిఫ్టీతో అదరగొట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత తన భార్య రితికా సజ్దేతో మాట్లాడిన మాటలను తాజాగా రివీల్ చేశాడు. ఫైనల్లో ఓడిపోయిన తర్వాత రితికాను ఆ మాట అడిగానని చెప్పుకొచ్చాడు రోహిత్.

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అద్భుతమైన బోణీ కొట్టింది. పసికూన ఐర్లాండ్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ మ్యాచ్ లో అర్థసెంచరీతో అలరించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఐర్లాండ్ పై విజయం సాధించిన తర్వాత వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు హిట్ మ్యాన్.  ఫైనల్లో ఓడిపోయిన తర్వాత తన భార్య రితికాను ఆ మాట అడిగానని చెప్పుకొచ్చాడు హిట్ మ్యాన్. ఇంతకీ ఆమెను ఏం అడిగాడంటే?

“వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత నిద్రలేచా.. ఆ రాత్రి ఇండియా ఓడిపోయినట్లు కల వచ్చింది. ఇలాగే జరుగుతుంది అంటావా? అయినా రేపు కదా మనం మ్యాచ్ ఆడాల్సింది అని నా భార్య రితికతో అన్నాను. అయితే కాసేపటికే నిజం తెలుసుకున్నాను. మనం ఓడిపోయామని గ్రహించాను. ఈ చేదు నిజాన్ని నాలుగైదు రోజుల వరకు జీర్ణం చేసుకోలేకపోయాను. వరల్డ్ కప్ లో వరుస విజయాలలో దూసుకెళ్లాం. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయాం. దాంతో అక్కడి నుంచి త్వరగా కార్యక్రమం ముగించుకుని వెళ్దాం అనుకున్నాను. ప్రతీ ఆటగాడు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నాడు. అసలు మన లైఫ్ లో ఏం జరుగుతోందో కూడా ఆ టైమ్ లో అర్ధం చేసుకోలేం.. అంతటి కోపం, నిరాశ ఎదురైయ్యాయి” అంటూ వరల్డ్ కప్ ఓటమి గురించి తాాజాగా పేర్కొన్నాడు రోహిత్ శర్మ. మరి వరల్డ్ కప్ బాధను ఇంకా మర్చిపోలేకపోతున్న రోహిత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss