iDreamPost
android-app
ios-app

70, 80 పరుగులకే ఆలౌట్ అవ్వాల్సిన ఇండియాని.. రోహిత్ ప్లాన్ కాపాడింది!

T20 World Cup 2024- Rohit Sharma Plan Against Pakistan: దాయాది దేశాన్ని టీమిండియా మరోసారి మట్టికరిపించింది. ఈసారి బ్యాటుతో కాస్త తడబడినా కూడా.. బాల్ తో మాత్రం శభాష్ అనిపించారు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మా వేసిన ఒక ప్లాన్ మాత్రం జట్టుకు విజయాన్ని అందించింది.

T20 World Cup 2024- Rohit Sharma Plan Against Pakistan: దాయాది దేశాన్ని టీమిండియా మరోసారి మట్టికరిపించింది. ఈసారి బ్యాటుతో కాస్త తడబడినా కూడా.. బాల్ తో మాత్రం శభాష్ అనిపించారు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మా వేసిన ఒక ప్లాన్ మాత్రం జట్టుకు విజయాన్ని అందించింది.

70, 80 పరుగులకే ఆలౌట్ అవ్వాల్సిన ఇండియాని.. రోహిత్ ప్లాన్ కాపాడింది!

పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. రెండుకు రెండు మ్యాచుల్లో విజయం సాధించి 4 పాయింట్లతో గ్రూప్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అటు దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం రెండుకు రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఇంక ఇండియా మీద అయితే దాదాపుగా గెలుస్తుందేమో అనే ఒక భయాన్ని కలిగించింది. ఎందుకంటే టీమిండియా చాలా తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయ్యింది. కేవలం 19 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. పాక్ జట్టు మాత్రం అంత తక్కువ లక్ష్యాన్ని కూడా ఛేదించడంలో తడబడింది. బ్యాటుతో విఫలమైన భారత్.. బాల్ తో మాత్రం పాక్ కు చుక్కులు చూపించారు. మొత్తానికి ఓటమి అంచుల్లో ఉన్న మ్యాచ్ ని రోహిత్ వేసిన మాస్టర్ ప్లాన్ కాపాడిందని మీకు తెలుసా?

కెప్టెన్ రోహిత్ శర్మా.. బ్యాటుతో పర్వాలేదు అనిపించినా కూడా.. కెప్టెన్ గా మాత్రం జట్టు విజయానికి కీలక పునాది వేశాడు. ఎందుకంటే మ్యాచ్ లో రోహిత్ తీసుకున్న ఒక నిర్ణయం టీమ్ ఫలితాన్ని మార్చేసింది. లేదంటే.. పాకిస్తాన్ జట్టు చేతిలో ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి అది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. చాలా త్వరగానే కోహ్లీ, రోహిత్ వికెట్లు కోల్పోయింది. నిజానికి కోహ్లీ కేవలం 4 పరుగులకే అవుట్ అవ్వగానే రోహిత్ తన ప్లాన్ అమలు చేశాడు. అదేంటంటే.. ఫోర్త్ డౌన్ లో రావాల్సిన రిషబ్ పంత్.. కోహ్లీ అవుట్ అవ్వగానే బ్యాటింగ్ కి వచ్చాడు. అలా రావడం మాత్రమే కాదు.. పాక్ బౌలర్లను చీల్చి చెండాడు. రిషబ్ పంత్ కు చాలానే లైఫ్స్ దక్కాయి.

అప్పటి వరకు కోహ్లీ, రోహిత్ కూడా కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించారు. కానీ, పంత్ మాత్రం చాలా స్వేచ్ఛగా పాక్ బౌలర్లను ఇరగదీశాడు. అంతేకాకుండా.. రోహిత్ అవుటయ్యాక అక్షర్ పటేల్ బ్యాటింగ్ కి వచ్చాడు. ఇదంతా హిట్ మ్యాన్ మాస్టర్ ప్లాన్ అని మీకు తెలుసా? అదేంటంటే.. పాక్ బౌలర్లు రైట్ హ్యాండర్స్ కి చాలా బాగా బౌలింగ్ చేయగలరు. కానీ, లెఫ్ట్ హ్యాండర్స్ అనగానే కాస్త ఇబ్బంది పడతారు. వారి వీక్ నెస్ ఆసరాగా చేసుకుని కెప్టెన్.. ముందుగానే పంత్, అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కి పంపాడు. అలా చేయడం వల్లే టీమిండియా కనీసం డిఫెండ్ చేసుకోగల పరుగులు చేయగలిగింది.

తర్వాత పిచ్ మరింత బౌలింగ్ కి సహకరించడంతో.. దూబే, పాండ్యా, జడేజా వంటి వాళ్లు కూడా చాలా త్వరగానే అవుట్ అయ్యారు. అలా కెప్టెన్ గనుక పంత్(42), అక్షర్ పటేల్(20) ముందే పంపకపోతే వారి ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు కెప్టెన్ మాస్టర్ ప్లాన్ తెలుసుకుని టీమిండియా ఫ్యాన్స్ హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంక బౌలింగ్ లో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో చెలరేగి ఆడింది. బుమ్రాకి 3 వికెట్లు, పాండ్యాకి 2 వికెట్లు, అర్షదీప్- అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. మరి.. టీమిండియా ఘన విజయం వెనుకన్న కెప్టెన్ మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.