Somesekhar
ఆఫ్గానిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన రికీ పాంటింగ్.. కామెంట్రీ బాక్స్ లోనే కన్నీటిని ఆపుకొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. వైరల్ గా మారింది.
ఆఫ్గానిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన రికీ పాంటింగ్.. కామెంట్రీ బాక్స్ లోనే కన్నీటిని ఆపుకొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. వైరల్ గా మారింది.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో చిన్న జట్టు అయిన ఆఫ్గానిస్తాన్ సంచలన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఈ టోర్నీలో లీగ్ దశలో న్యూజిలాండ్ కు షాకిచ్చిన ఆ టీమ్.. ఆదివారం జరిగిన మ్యాచ్ ల ఏకంగా ఆస్ట్రేలియానే చిత్తుచేసింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో 21 రన్స్ తో ఆసీస్ ను చిత్తు చేసి.. చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. ఏ ఫార్మాట్ లో అయినా.. కంగారూ టీమ్ పై ఆఫ్గాన్ ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక తమ జట్టు ఓడిపోవడంతో.. కామెంట్రీ బాక్స్ లో కన్నీటిని ఆపుకొన్నాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి.. వరల్డ్ క్రికెట్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 6 ఓవర్లలో 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్(60), జద్రాన్(53) పరుగులతో రాణించారు. ఇక ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తీశాడు. అనంతరం 149 పరుగుల ఓ మోస్తారు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ ను ఆఫ్గాన్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. వారి బౌలింగ్ ముందు నిలబడలేక 127 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. గుల్బాదిన్ నైబ్ 4, నవీన్ ఉల్ హక్ 3 వికెట్లతో ఆసీస్ ఓటమిని శాసించారు. మాక్స్ వెల్(59) పరుగులు చేసినప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో.. కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ఎమోషనల్ అయ్యాడు. చివరి వికెట్ పడగానే బాధను పంటికింద బిగపట్టుకుని, ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొన్నాడు. ఆసీస్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఇక మరో కామెంటేటర్ ఇయాన్ స్మిత్ ఆఫ్గాన్ విజయాన్ని తనదైన శైలిలో పొగిడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి తమ జట్టు ఓడిపోవడాన్ని చూసి పాంటింగ్ తట్టుకోలేక ఎమోషనల్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.