Nidhan
పొట్టి ప్రపంచ కప్‌కు ఇంకో వారం రోజుల వ్యవధి కూడా లేదు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టీమ్స్‌కు ప్యాట్ కమిన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
పొట్టి ప్రపంచ కప్‌కు ఇంకో వారం రోజుల వ్యవధి కూడా లేదు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టీమ్స్‌కు ప్యాట్ కమిన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
Nidhan
క్రికెట్లో బాగా కష్టపడితే మంచి బ్యాటర్‌గా, బౌలర్‌గా పేరు తెచ్చుకోవచ్చు. కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేస్తే స్టార్ ప్లేయర్‌గా ఎదగొచ్చు. కొన్ని ఏళ్ల పాటు దాన్నే కంటిన్యూ చేస్తే లెజెండ్‌గా అవతరించొచ్చు. అయితే ఓ ఆటగాడిగా పేరు తెచ్చుకోవడం కంటే కెప్టెన్‌గా గ్రేట్ అనిపించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ అనేది ఆయా ప్లేయర్ల చేతుల్లో ఉంటుంది. కానీ సారథిగా రాణించాలంటే జట్టును ఏకతాటిపై నడిపించాలి. తాను రాణిస్తూనే టీమ్‌లోని ఆటగాళ్లందరి నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ను రాబట్టాలి. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే కెప్టెన్సీలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ఈ తరం చూసిన తోపు కెప్టెన్లలో ఒకడిగా ప్యాట్ కమిన్స్‌ను చెప్పొచ్చు.
కెప్టెన్‌గా ఆస్ట్రేలియా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు కమిన్స్. ఏడాది కాలంలో ఆ టీమ్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను అందించాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోనూ విన్నర్‌గా నిలిపాడు. ఆ తర్వాత భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్‌నూ కంగారూలకు అందించాడు. ఆసీస్ తరఫునే కాదు.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథిగానూ విజయవంతం అయ్యాడు. గతేడాది పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ను ఈసారి ఏకంగా ఫైనల్‌కు చేర్చాడు కమిన్స్. అతడి జోరును ఆపడం ఎవరి తరం కావడం లేదు. త్వరలో వెస్టిండీస్-యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచ కప్‌లోనూ ఆస్ట్రేలియాను విజేతగా నిలబెట్టాలని చూస్తున్నాడు. మరో వారం రోజుల్లో పొట్టి కప్పు మొదలుకానుంది. ఈ తరుణంలో అతడు మిగతా జట్లకు వార్నింగ్ ఇచ్చాడు.
వరల్డ్ కప్ గురించి కమిన్స్ మాట్లాడుతూ ఈసారి తాము ఫేవరెట్స్ కాదన్నాడు. అయితే టోర్నీలోని బెస్ట్ టీమ్స్‌లో తమది కూడా ఒకటన్నాడు. వన్డే ప్రపంచ కప్ నెగ్గిన జట్టులోని చాలా మంది ఆటగాళ్లతో ఈసారి మెగా టోర్నీకి వస్తున్నామని చెప్పాడు. ఆసీస్ స్క్వాడ్ బలంగా ఉందని, తమకు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల అండ ఉందన్నాడు కమిన్స్. వరల్డ్ కప్ మీద కన్నేశామని.. కప్పును సొంతం చేసుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో తమ బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తామన్నాడు. ఫేవరెట్స్‌లో తమ టీమ్ లేదంటూనే, కప్పు కోసం ఏం చేసేందుకైనా రెడీ అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇంకో కప్పు మీద కమిన్స్ కర్చీఫ్ వేశాడని అంటున్నారు. మరి.. పొట్టి కప్పులో ఆసీస్ హవా నడుస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Pat Cummins said “I am not sure we are favourites, we are one of the better sides, got experience & similar squad from the World Cup winning team, we will give our best crack”. [Talking about T20I World Cup 2024 on Sports Tak] pic.twitter.com/FuDLqOXeMS
— Johns. (@CricCrazyJohns) May 25, 2024