iDreamPost

ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం! కివీస్ బౌలర్ ఊహకందని రికార్డ్!

ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. అసలు ఈ రికార్డును సాధిస్తారని బహుశా ఎవ్వరూ అనుకొని ఉండరు. అలాంటి ఘనతను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు కివీస్ స్టార్ బౌలర్. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. అసలు ఈ రికార్డును సాధిస్తారని బహుశా ఎవ్వరూ అనుకొని ఉండరు. అలాంటి ఘనతను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు కివీస్ స్టార్ బౌలర్. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం! కివీస్ బౌలర్ ఊహకందని రికార్డ్!

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. అయితే రికార్డులందు ఈ రికార్డు వేరయా.. అన్న రేంజ్ లో మాత్రం కొన్ని ఘనతలే సృష్టించబడతాయి. అలా ఎవ్వరూ ఊహించని రికార్డు ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో నమోదు అయ్యింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ మెగాటోర్నీలో కివీస్ బౌలర్ ఊహకందని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. దాంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్-పుపువా న్యూ గినియా జట్ల మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూ గినియా టీమ్ పెర్గూసన్ బౌలింగ్ ధాటికి బెంబేలెత్తిపోయింది. నిప్పులు చెరిగే బంతులతో పసికూన బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్ ను ఎలా ఎదుర్కొవాలో తెలీక పీఎన్జీ ప్లేయర్లు వణికిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే బ్యాటింగ్ కు దిగడానికే భయపడ్డారు. దాంతో ఆ టీమ్ 78 రన్స్ కే కుప్పకూలింది.

ఫెర్గూసన్ ఈ మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల కోటాలో పరుగులేమీ ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టి.. అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. 4 ఓవర్లు కూడా మెయిడెన్ వేసి.. ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురిచేశాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు క్రియేట్ చేసిన తొలి బౌలర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. అలాగే ఇంటర్నేషనల్ టీ20ల్లో కూడా ఇవే  బెస్ట్ గణాంకాలు కావడం విశేషం. కాగా.. గతంలో కెనడాకు చెందిన బౌలర్ సాద్ బిన్ జాఫర్ కూడా నాలుగు మెయిడెన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వరల్డ్ కప్ నుంచి ఇంటిదారి పట్టిన కివీస్ కు చివరి మ్యాచ్ లో ఓదార్పు విజయం దక్కింది. 7 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పుపువా న్యూ గినియా లూకీ ఫెర్గూసన్ ధాటికి 19.4 ఓవర్లలో 78 రన్స్ కే పేకమేడలా కుప్పకూలింది. అనంతరం 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది కివీస్. ఇక ఈ గెలుపుతో కివీస్ గ్రూప్ సీలో మూడో స్థానంతో తన ప్రస్థానాన్ని ముగించింది. మరి ఎవ్వరూ ఊహించని విధంగా ఫెర్గూసన్  నాలుగు ఓవర్లకు నాలుగూ మెయిడెన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి