iDreamPost
android-app
ios-app

బుమ్రా, స్టార్క్ వల్లే కాలేదు.. క్రేజీ రికార్డ్ బద్దలు కొట్టిన నేపాల్ బౌలర్!

  • Published Jun 18, 2024 | 1:47 PM Updated Updated Jun 18, 2024 | 1:47 PM

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ల వల్ల కాని రికార్డును సందీప్ లామిచానే బద్దలు కొట్టి చూపించాడు. ఇంతకీ ఆ క్రేజీ రికార్డు ఏంటి? తెలుసుకుందాం పదండి.

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ల వల్ల కాని రికార్డును సందీప్ లామిచానే బద్దలు కొట్టి చూపించాడు. ఇంతకీ ఆ క్రేజీ రికార్డు ఏంటి? తెలుసుకుందాం పదండి.

బుమ్రా, స్టార్క్ వల్లే కాలేదు.. క్రేజీ రికార్డ్ బద్దలు కొట్టిన నేపాల్ బౌలర్!

సందీప్ లామిచానే.. అనేక వివాదాలు, వీసా సమస్యల కారణంగా టీ20 వరల్డ్ కప్ లోకి లేట్ గా వచ్చాడు ఈ నేపాల్ బౌలర్. అయితే లేట్ గా వచ్చినప్పటికీ.. లేటెస్ట్ గా ఓ క్రేజీ రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. నేపాల్ తరఫున ఈ మెగాటోర్నీలో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ల వల్ల కాని రికార్డును సందీప్ బద్దలు కొట్టి చూపించాడు. ఇంతకీ ఆ క్రేజీ రికార్డు ఏంటి? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో 107 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఛేదించలేక నేపాల్ 85 రన్స్ కే కుప్పకూలి.. 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో గ్రూప్ దశలోనే పసికూన నేపాల్ ఇంటిదారి పట్టింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టాడు సందీప్ లామిచానే. ఈ క్రమంలోనే ఓ క్రేజీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ బౌలర్లకు సైతం అందని రికార్డును సొంతం చేసుకుని ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు సందీప్ లామిచానే. కేవలం 54 మ్యాచ్ ల్లో 100 వికెట్లు తీసుకున్నాడు. ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఆఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్. అతడు 53 మ్యాచ్ ల్లోనే 100 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ జాబితాలో శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ(63 మ్యాచ్ ల్లో), పాకిస్తాన్ స్టార్ పేసర్ హారీస్ రౌఫ్(71 మ్యాచ్ ల్లో) మూడు, నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు.

కాగా.. టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా ఉండకపోవడం కొసమెరుపు. అలాగే వరల్డ్ క్లాస్ బౌలర్ గా గుర్తింపు పొందిన మిచెల్ స్టార్క్ సైతం ఈ లిస్ట్ లో లేడు. స్టార్క్ 63 టీ20 మ్యాచ్ ల్లో కేవలం 76 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. మరోవైపు బుమ్రా 65 టీ20ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. మరి దిగ్గజ బౌలర్ల వల్ల కానిది సాధించిన నేపాల్ బౌలర్ సందీప్ లామిచానేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.