iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే నమీబియా ప్లేయర్ ఊహించని ఫీట్! ఇది చెత్త రికార్డా?

  • Published Jun 17, 2024 | 7:34 AM Updated Updated Jun 17, 2024 | 7:34 AM

టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే నమీబియా ఓపెనర్ ఓ రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పొట్టి ప్రపంచ కప్ హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే నమీబియా ఓపెనర్ ఓ రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పొట్టి ప్రపంచ కప్ హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే నమీబియా ప్లేయర్ ఊహించని ఫీట్! ఇది చెత్త రికార్డా?

టీ20 వరల్డ్ కప్ లో ఎన్నో గొప్ప రికార్డులు నమోదు అయ్యాయి, అవుతున్నాయి కూడా. ఇక గొప్ప రికార్డులతో పాటుగా చెత్త ఘనతలు కూడా క్రియేట్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024 మెగాటోర్నీలో ఎవ్వరూ ఊహించని రికార్డును సృష్టించాడు నమీబియా ఓపెనర్ నికోలాస్ డేవిన్. దాంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇలాంటి రికార్డును నెలకొల్పిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. అయితే ఇది గొప్ప రికార్డా? లేక చెత్త రికార్డా? తెలియడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో నమీబియా ఓపెనర్ నికోలస్ డేవిన్ రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 47 పరుగులు చేశాడు. బెయిర్ స్టో 31 రన్స్ తో రాణించాడు. ఇక అనంతరం 123 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా ఓపెనర్ నికోలస్ డేవిన్ ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు.

ఈ క్రమంలోనే నికోలస్ 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దాంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటం, డేవిన్ బంతులను వృథా చేస్తున్నాడు అని భావించిన నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ నికోలస్ ను రిటైర్డ్ అవుట్ వెనక్కి పిలిపించాడు. దాంతో అతడు డగౌట్ కు వచ్చేశాడు. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇలా రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగిన తొలి ప్లేయర్ గా నిలిచాడు నికోలస్. ఇప్పటి వరకు ఇలా ఏ ప్లేయర్ అవుట్ అవ్వలేదు. ఇదిలా ఉండగా.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఈ మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

మరోవైపు స్కాట్లాండ్ పై ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. ఇంగ్లండ్ సూపర్ 8కు చేరుకుంది. మరి పొట్టి ప్రపంచ కప్ హిస్టరీలోనే ఇలాంటి రేర్ ఫీట్ సాధించిన నికోలస్ పై క్రీడాభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అసలు చరిత్రలో తొలి ప్లేయర్ గా నిలిచినందుకు ఇది గొప్ప రికార్డ్ అనుకోవాలా? లేక బంతులు ఎక్కువగా ఆడి తక్కువ పరుగులు చేసినందుకు రిటైర్డ్ అవుట్ గా వచ్చినందుకు చెత్త రికార్డ్ అనుకోవాలా? అని క్రికెట్ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.