Nidhan
టీ20 వరల్డ్ కప్ భారత్‌దేనని మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. అయితే రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియాను గెలిపించే మొనగాడు అతడేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్ భారత్‌దేనని మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. అయితే రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియాను గెలిపించే మొనగాడు అతడేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా దూసుకెళ్తోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో హవా నడిపిస్తోంది. ఎదురొచ్చిన జట్టును చిత్తు చేస్తూ ఆధిపత్యం చలాయిస్తోంది. వరుసగా ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్ఏను ఓడించిన రోహిత్ సేన.. సూపర్-8 దశకు క్వాలిఫై అయింది. ఇవాళ కెనడాతో మ్యాచ్‌ను పక్కనబెడితే నెక్స్ట్ స్టేజ్‌లో భారత్ ఆటతీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు మన టీమ్ ఆడిన గ్రూప్ మ్యాచెస్ అమెరికాలో ఆడింది. ఇక్కడి ట్రిక్కీ పిచ్‌లపై బౌలర్ల సాయంతో నెట్టుకొచ్చింది. అయితే తదుపరి మ్యాచుల కోసం కరీబియన్ ద్వీపాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి స్లో పిచ్‌ల మీద మెన్ ఇన్ బ్లూ ఎలా ఆడతారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీదే అందరూ ఫోకస్ చేస్తున్నారు.
విండీస్ మైదానాలపై ఆడిన అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ రాణిస్తే భారత్‌కు తిరుగుండదని అంటున్నారు. ఫామ్‌లోని లేని విరాట్ ఒక్కసారి టచ్‌లోకి వస్తే ఆపడం కష్టమేనని చెబుతున్నారు. వీళ్లిద్దరి ఆటతీరును బట్టే మెగాటోర్నీలో టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వెటరన్ పేసర్ లక్ష్మీపతి బాలాజీ మాత్రం రోహిత్, కోహ్లీ కంటే పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రానే కీలకం అవుతాడని అంటున్నాడు. సింగిల్ హ్యాండ్‌తో జట్టుకు వరల్డ్ కప్ అందించే సత్తా బుమ్రా ఉందని అతడు చెబుతున్నాడు. అతడు ఏంటో ఇప్పటికే చూశామని.. అసలు రూపం మున్ముందు చూస్తారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్ బాటలో అతడు నడుస్తున్నాడని.. రాబోయే దశాబ్దం బుమ్రాదేనంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు బాలాజీ.
‘జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆసియా ఖండంలో వసీం అక్రమ్ తర్వాత అతడే అత్యుత్తమ పేస్ బౌలర్ అని చెప్పాలి. రాబోయే దశాబ్దాన్ని బుమ్రా ఏలుతాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను సింగిల్ హ్యాండ్‌తో గెలిపించగల సామర్థ్యం అతడికి ఉంది. ఒకవేళ పొట్టి కప్పును అందిస్తే అతడికి తిరుగుండదు. టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్ అనే తేడాల్లేవు. ఏ ఫార్మాట్ అయినా సరే బంతి చేతికిస్తే చాలు బుమ్రా చెలరేగిపోతున్నాడు. న్యూ బాల్, ఓల్డ్ బాల్ అనేది పట్టించుకోకుండా ప్రతి దశలోనూ వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు. అతడి వేరియేషన్స్ వల్లే మిడిల్ ఓవర్లలో కూడా వికెట్లు పడుతున్నాయి. బుమ్రాను మించిన వెర్సటైల్, డేంజరస్ బౌలర్ ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు’ అని బాలాజీ చెప్పుకొచ్చాడు. బౌలింగ్ యూనిట్‌తో పాటు మొత్తం టీమ్‌ను కెప్టెన్‌గా లీడ్ చేసే దమ్ము బుమ్రాకు ఉందన్నాడు. కూల్‌గా ఉండటం, మెచ్యూరిటీ లెవల్స్, గేమ్ అవేర్నెస్ అన్నీ చూస్తుంటే.. త్వరలో భారత కెప్టెన్‌గా బుమ్రాను చూసే అవకాశాలు ఉన్నాయని బాలాజీ పేర్కొన్నాడు. మరి.. బాలాజీ చెప్పినట్లు బుమ్రా భారత్‌కు కప్పు అందిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
L Balaji ” Jasprit Bumrah is the next best in our continent only after Wasim Akram.I feel this is the right time for Bumrah to chase greatness over the next decade, particularly if he can single handedly win India this T20 World Cup.”pic.twitter.com/HTidkASo05
— Sujeet Suman (@sujeetsuman1991) June 15, 2024