iDreamPost

Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా ను వెనక్కినెట్టి.. అరుదైన ఘనత సాధించిన బుమ్రా!

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా ను వెనక్కినెట్టి.. అరుదైన ఘనత సాధించిన బుమ్రా!

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి.. 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దాంతో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ క్రమంలోనే టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వెనక్కినెట్టి.. ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనతను నెలకొల్పాడు. అసలు విషయం ఏంటంటే? అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్ గా నిలిచాడు బుమ్రా. ఇప్పటి వరకు 64 టీ20 మ్యాచ్ ల్లో 79 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే పాండ్యా రికార్డ్ ను బ్రేక్ చేశాడు. పాండ్యా 94 మ్యాచ్ ల్లో 78 వికెట్లు తీశాడు. పాక్ తో మ్యాచ్ కు ముందు ఇద్దరు కూడా 76 వికెట్లతో సమంగా ఉన్నారు. ఇక ఈ లిస్ట్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు యజ్వేంద్ర చాహల్. అతడు 80 మ్యాచ్ ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్ గా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు న్యూజిలాండ్ స్టార్ పేసర్ టీమ్ సౌథీ. ఈ కివీస్ పేసర్ 123 మ్యాచ్ ల్లో 157 వికెట్లు పడగొట్టాడు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి