iDreamPost

ఆ విషయంలో రోహిత్ అనవసర రిస్క్ చేస్తున్నాడు.. ఆసీస్ లెజెండ్ వార్నింగ్!

  • Published May 30, 2024 | 9:32 PMUpdated May 30, 2024 | 9:32 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనవసర రిస్క్ చేస్తున్నాడని ఓ ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు. ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోతే భారత్​కు కష్టమేనని చెప్పాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనవసర రిస్క్ చేస్తున్నాడని ఓ ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు. ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోతే భారత్​కు కష్టమేనని చెప్పాడు.

  • Published May 30, 2024 | 9:32 PMUpdated May 30, 2024 | 9:32 PM
ఆ విషయంలో రోహిత్ అనవసర రిస్క్ చేస్తున్నాడు.. ఆసీస్ లెజెండ్ వార్నింగ్!

టీ20 వరల్డ్ కప్​-2024కు అంతా సిద్ధమైంది. మరో మూడ్రోజుల్లో ప్రపంచ కప్ సంరంభం మొదలవనుంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ యూఎస్​ఏకు చేరుకొని ప్రాక్టీస్ మ్యాచ్​లు కూడా ఆడేశాయి. కప్పు వేటలో ఉన్న భారత జట్టు కూడా జోరుగా సాధన చేస్తోంది. వన్డే వరల్డ్ కప్-2023ని కొద్దిలో కోల్పోయిన రోహిత్ సేన.. ఈసారి మాత్రం అస్సలు వదిలేదేలే అంటోంది. అన్ని టీమ్స్​కు ఝలక్ ఇచ్చి టైటిల్ విన్నర్​గా నిలవాలని చూస్తోంది. మెగా టోర్నీ కోసం టీమిండియా బలమైన లైనప్​తో వచ్చింది. అన్ని స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. చాలా ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో వరల్డ్ కప్​లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ ఎలాంటి స్క్వాడ్​తో ముందకు వెళ్తాడనేది చూడాలి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా లెజెండ్ మైకేల్ క్లార్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్ అనవసర రిస్క్ చేస్తున్నాడని క్లార్క్ అన్నాడు. కాస్త తారుమారైనా జట్టుకు ఓటములు తప్పవంటూ హెచ్చరించాడు. మెగా టోర్నీకి యూఎస్​ఏ-వెస్టిండీస్​లు ఆతిథ్యం ఇస్తున్నాయి. విండీస్​లో స్లో పిచ్​లు ఉంటాయి. దీంతో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లను టీమ్​లోకి తీసుకుంది భారత్. స్లో పిచ్​లపై ప్రత్యర్థుల పని పట్టేందుకు ఈ వ్యూహంతో ముందుకు వెళ్లాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు. అయితే యూఎస్​లో మాత్రం ఆస్ట్రేలియాలో తయారు చేసిన పిచ్​లను ఓడల ద్వారా తెప్పించారు. దీంతో అక్కడి పిచ్​లు పేస్, బౌన్స్​, స్వింగ్​కు సహకరిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా స్పిన్ వ్యూహం దెబ్బకొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్లార్క్ పైవిధంగా రియాక్ట్ అయ్యాడు.

‘వరల్డ్ కప్ స్క్వాడ్ విషయంలో టీమిండియా బిగ్ రిస్క్ చేసినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ జట్టు స్పిన్​ మీద అతిగా ఆధారపడుతోంది. ప్రపంచ కప్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా స్క్వాడ్ కంటే భారత స్క్వాడ్ చాలా భిన్నంగా ఉంది. కంగారూ టీమ్​లో పేస్ ఆల్​రౌండర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టు మెగా టోర్నీలో అందరి కంటే ఫేవరెట్​గా కనిపిస్తోంది’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. స్పిన్ ఉచ్చుతో ప్రత్యర్థులను బెదరగొట్టాలని రోహిత్ చూస్తున్నాడని.. ఇది సక్సెస్ అవుతుందా? కాదా? అనేది కాలమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశాడు. హిట్​మ్యాన్ చేస్తున్న రిస్క్ సక్సెస్ అయితే భారత్​కు తిరుగుండదని పేర్కొన్నాడు. మరి.. రోహిత్ రిస్క్ చేస్తున్నాడంటూ క్లార్క్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి