iDreamPost
android-app
ios-app

Jos Buttler: పసికూనపై బట్లర్ పిడుగు.. సిక్సర్ల వర్షం కురిపించిన ఇంగ్లండ్ కెప్టెన్!

  • Published Jun 24, 2024 | 8:39 AM Updated Updated Jun 24, 2024 | 8:39 AM

అమెరికా బౌలర్లను బెంబేలెత్తిస్తూ.. సిక్సర్ల వర్షం కురిపించాడు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్. దాంతో 10 వికెట్ల తేడాతో అమెరికాపై భారీ విజయం సాధించి.. సెమీస్ కు దూసుకెళ్లింది ఇంగ్లండ్.

అమెరికా బౌలర్లను బెంబేలెత్తిస్తూ.. సిక్సర్ల వర్షం కురిపించాడు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్. దాంతో 10 వికెట్ల తేడాతో అమెరికాపై భారీ విజయం సాధించి.. సెమీస్ కు దూసుకెళ్లింది ఇంగ్లండ్.

Jos Buttler: పసికూనపై బట్లర్ పిడుగు.. సిక్సర్ల వర్షం కురిపించిన ఇంగ్లండ్ కెప్టెన్!

టీ20 వరల్డ్ కప్ లో తన జోరును కొనసాగిస్తోంది ఇంగ్లండ్. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టే స్థితి నుంచి ఇప్పుడు ఏకంగా సెమీస్ బెర్త్ నే ఖరారు చేసుకుంది. గత కొన్ని మ్యాచ్ ల నుంచి ఇంగ్లండ్ ఆటతీరే మారిపోయింది. బ్యాటర్లు రెచ్చిపోయి పరుగులు చేస్తున్నారు. తాజాగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి.. 10 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో పసికూన బౌలర్లపై విరుచుకుపడ్డారు. బట్లర్ బాదుడుకు ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రేక్షకపాత్ర వహించారు.

సూపర్ 8లో భాగంగా ఇంగ్లండ్ వర్సెస్ అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ కెప్టెన్ బట్లర్ శివాలెత్తిపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. 115 పరుగులకే కుప్పకూలింది. నితీశ్ కుమార్(30) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. కోరీ అండర్సన్(29) పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ తో పాటు మరో వికెట్ కూడా పడగొట్టాడు. అనంతరం 116 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు వికెట్ నష్టపోకుండా.. 9.4 ఓవర్లలోనే టార్గెట్ ను దంచికొట్టింది. కెప్టెన్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. అమెరికా బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆదినుంచే భారీ షాట్లు కొడుతూ.. యూఎస్ఏ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

ఏ దశలోనూ అమెరికా బౌలర్లు బట్లర్ ను అడ్డుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో విశ్వరూపం చూపించాడు. ఈ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి ఇచ్చాడు ఫిలిప్ సాల్ట్. ఆ తర్వాత వరుస బంతుల్లో 6, 6, 6, 6, వైడ్, 6 బాదాడు. ఈ ఓవర్లో మెుత్తం 5 సిక్సులతో 32 రన్స్ పిండుకున్నారు.  అందులో 104 మీటర్ల ఓ భారీ సిక్స్ కూడా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 38 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ సాల్ట్(25) రన్స్ తో అతడికి అండగా నిలిచాడు. బట్లర్ తుఫాన్ బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. మరి అతడి మెరుపు బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.