iDreamPost

IND vs AUS: ఆస్ట్రేలియా అహం అణిచిన భారత్.. ఓటమి తరువాత మార్ష్ మాటలు వింటే పాపం అంటారు

ఆస్ట్రేలియా అహాన్ని టీమిండియా అణిచింది. సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాటలు వింటే పాపం అంటారు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

ఆస్ట్రేలియా అహాన్ని టీమిండియా అణిచింది. సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాటలు వింటే పాపం అంటారు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

IND vs AUS: ఆస్ట్రేలియా అహం అణిచిన భారత్.. ఓటమి తరువాత మార్ష్ మాటలు వింటే పాపం అంటారు

ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు ఉన్నంత అహంకారం మరే ఇతర దేశానికి ఉండదని కొందరు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక ఈ విషయం వన్డే వరల్డ్ కప్ 2023 గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి రుజువు చేశాడు. ఆ అహాన్ని నేడు టీమిండియా అణిచివేసింది. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో కంగారూ టీమ్ ను 24 రన్స్ తేడాడో ఓడించి.. టీమిండియా పవర్ ఏంటో చూపించింది. ఇక ఈ ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాటలు వింటే పాపం అంటారు. ఓటమితో తలపొగరు తగ్గిన మార్ష్ ఏమన్నాడంటే?

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమికి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. సూపర్ 8 మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో కంగారూ టీమ్ ను చిత్తు చేసింది. దాంతో ఈ మెగాటోర్నీ నుంచి ఆసీస్ ఎలిమినేట్ అయ్యే పరిస్థితికి వచ్చిది. బంగ్లాదేశ్ పై ఆఫ్గానిస్తాన్ విజయం సాధిస్తే.. ఆసీస్ ఇంటికి వెళ్లాల్సిందే. ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. మూడు పాయింట్లతో ఉన్న ఆఫ్గాన్ సెమీస్ కు చేరుతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఆఫ్గానిస్తాన్ పై 61 పరుగుల తేడాతో విజయం లేదా 13 ఓవర్లలోనే టార్గెట్ ను బంగ్లాదేశ్ ఛేదిస్తే.. బంగ్లానే సెమీస్ కు చేరుతుంది. దాంతో ఆసీస్, ఆఫ్గాన్ లు ఇంటిదారి పడతాయి.

ఈ నేపథ్యంలో సెమీస్ పోరు రసవత్తరంగా మారింది. ఇక ఇండియాపై ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాకు తలపొగరు తగ్గింది అనుకుంటా. అందుకే ఆ టీమ్ కెప్టెన్ ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశాడు. భారత్ పై ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ..”బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గాన్ మ్యాచ్ లో మా మద్ధతు బంగ్లాకే. ఆ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. కమాన్ బంగ్లా” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో మార్ష్ మాటల విన్న నెటిజన్లు.. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నీ మాటలు వింటే పాపం అనాలనిపిస్తోందని జాలి చూపిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఒక్క ఓటమితో ఇంతలా దిగజారాలా? అని విమర్శిస్తున్నారు. ఇండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది, ఇండియా పవర్ అంటే ఇదే! అని ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి ఒక్క ఓటమితో ఆసీస్ ఇంతలా దిగజారడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి