iDreamPost

IND vs IRE: పసికూనపై అర్షదీప్ చెత్త బౌలింగ్.. ఒకే ఓవర్లో ఏకంగా 10 బంతులు..

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోతున్నారు. అర్షదీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసినప్పటికీ.. మరుసటి ఓవర్లో చెత్త బౌలింగ్ తో నిరాశపరిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోతున్నారు. అర్షదీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసినప్పటికీ.. మరుసటి ఓవర్లో చెత్త బౌలింగ్ తో నిరాశపరిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs IRE: పసికూనపై అర్షదీప్ చెత్త బౌలింగ్.. ఒకే ఓవర్లో ఏకంగా 10 బంతులు..

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో ఆడుతోంది. న్యూయార్క్ లోని నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఒకే ఓవర్లో అద్భుతమైన బ్రేక్ త్రూ అందించాడు యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్. అయితే సూపర్ బౌలింగ్ వేశాడని పొగిడేలోపే విమర్శలకు తావిచ్చేలా చెత్త బౌలింగ్ వేశాడు.

టీ20లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు పసికూన బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని వమ్ముచేయకుండా బౌలింగ్ చేశాడు అర్షదీప్ సింగ్. తొలి ఓవర్ వేసిన అర్షదీప్ కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ వేయడానికి వచ్చిన అర్షదీప్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్ తొలి బంతికే ప్రమాదకర బ్యాటర్ స్టిర్లింగ్(2)ను పెవిలియన్ కు పంపాడు. ఇక అదే ఓవర్లో చివరి బంతికి బల్బెర్నీ(5)ను అవుట్ చేశాడు. ఈ ఓవర్లో కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

అయితే ఈ రెండు ఓవర్లు బాగా వేశాడని అందరూ ప్రశంసించే లోపే.. విమర్శలకు తావిచ్చేలా చెత్త బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేయడానికి వచ్చిన అర్షదీప్ కు ఏమైందో తెలియదు కానీ.. ఈ ఓవర్లో ఏకంగా 10 బంతులు వేశాడు. అందులో 4 వైడ్లు ఉన్నాయి. ఏకాగ్రతను కోల్పోయిన అర్షదీప్ లయను తప్పాడు. దాంతో వైడ్లు వేశాడు. మెుత్తంగా ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం 9 ఓవర్లు పూర్తైయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. అర్షదీప్, పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి