iDreamPost

OTTలో సోషియో ఫ్యాంటసీ మూవీ! ఏడాది వెయిటింగ్ తరువాత వచ్చింది!

  • Published Mar 13, 2024 | 12:36 PMUpdated Mar 14, 2024 | 3:56 PM

నటి పూర్ణ నటించిన సూపర్ నేచరల్ సోషియో ఫ్యాంటసీ చిత్రం సువర్ణ సుందరి. అయితే తాజాగా సినిమా ఏడాది తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అది ఎక్కడంటే..

నటి పూర్ణ నటించిన సూపర్ నేచరల్ సోషియో ఫ్యాంటసీ చిత్రం సువర్ణ సుందరి. అయితే తాజాగా సినిమా ఏడాది తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అది ఎక్కడంటే..

  • Published Mar 13, 2024 | 12:36 PMUpdated Mar 14, 2024 | 3:56 PM
OTTలో సోషియో ఫ్యాంటసీ మూవీ! ఏడాది వెయిటింగ్ తరువాత వచ్చింది!

ఈ మధ్యకాలంలో ఓటీటీలోని హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ ఫ్యాంటసీ మూవీలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే రకరకాల భాషల్లో వారానికి ఓ కొత్త సినిమా మూవీ లవర్స్ కి అలరించడానికి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇందులో థియేటర్లలో అంతగా మెప్పించని సినిమాలు కూడా ఓటీటీలో దూసుకుపోవడం విశేషం. ఇక ఎప్పటిలాగే ఈవారం కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి మరో కొత్త సినిమా అందుబాటులో ఉంది. ఆ సినిమానే ‘సువర్ణ సుందరి’. ఇందులో పూర్ణ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు.కాగా, ఈ సినిమా గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదలైయింది. అయితే సూపర్ నేచురల్ సోషియా ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఏడాది తర్వాత ఇప్పడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది.

సూపర్ నేచరల్ సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ఈ సినిమా గతేడాది ఫిబ్రవరి 3న థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకత్వం వహించగా.. ఇందులో అలనాటి హీరోయిన్ జయప్రద, నటి పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటించారు.అయితే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమవ్వడంతో పాటు.. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో ఎట్టాకేలకు ఈ సినిమా ఏడాది తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. సువర్ణ సుందరి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్ నేటి నుంచే అందుబాటులోకి వచ్చేసింది. అది కూడా తెలుగులో మాత్రమే కావడం విశేషం. అయితే ఇక్కడ సువర్ణ సుందరి మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ అనేది రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ వచ్చింది. కాగా, ఇది రూ.79 రెంట్ తో అడుగు పెట్టింది. అలాగే త్వరలోనే ఈ మూవీ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్లందరికీ ఉచితంగా స్ట్రీమింగ్‍కు వచ్చే ఆవకాశం ఉంది. ఇక ఈ సినిమాను ఎం.ఎల్.లక్ష్మి నిర్మించగా.. సాయి కార్తీక్ సంగీతం అందించారు. కాగా, ఇందులో సాయికుమార్, రామ్, ఇంద్ర, నాగినీడు, కోట శ్రీనివాసరావు కీలకపాత్రలు పోషించారు.

poorna movie in ott 2

ఇక సువర్ణ సుందరి మూవీ విషయానికొస్తే..ఈ సినిమా త్రినేత్రి విగ్రహం చుట్టూనే సువర్ణ సుందరి కథ తిరుగుతుంది. కొన్ని తరాలుగా ఈ విగ్రహం వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయన్నది ఈ చిత్రంలో ఉంటుంది. 15వ శతాబ్దం, 18వ శతాబ్దం,19వ శతాబ్దం, ప్రస్తుత కాలం.. ఇలా నాలుగు టైమ్‍లైన్ల మధ్య ఈ సినిమా సాగుతుంది. సస్పెన్స్ ఎలిమెంట్లు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. వీఎఫ్‍ఎక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి, ఇవన్నీ తెలుసుకోవలంటే అమెజాన్ ప్రైమ్ లో రెంట్ లో పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతున్న సువర్ణ సుందరి చూసేయాల్సిందే. మరి, అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చిన సువర్ణ సుందరి సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి