iDreamPost

BREAKING:BJP ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత

గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వేసిన సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను సైతం విడుదల చేసింది. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే రాజా సింగ్, ఆయన అభిమానులు సంతోషం వ్కక్తం చేస్తున్నారు.

బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్బపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను సైతం విడుదల చేసింది. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే రాజా సింగ్, ఆయన అభిమానులు సంతోషం వ్కక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ అభ్యర్థుల మొదటి విడత విడుదలకు ముందే రాజా సింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో అతని పేరు ఫస్ట్ లీస్టులో ఉన్నట్లేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజా సింగ్ కు బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయింది.
అసలేం జరిగిందంటే?
ఆగస్టు 22న రాజాసింగ్ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మా వర్గాన్ని రాజాసింగ్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తూ సంచన నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీంతో పాటు సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని కూడా పార్టీ ఆదేశించింది. తదనంతరం ఆయనపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి