iDreamPost

ఎన్నికల వేల EC సంచలన నిర్ణయం.. ఏకంగా 107 మందిపై అనర్హత వేటు!

  • Published Oct 21, 2023 | 11:01 AMUpdated Oct 21, 2023 | 11:01 AM

ఎన్నికల సమయంలో అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఎన్నికల్లోపోటీ చేసి తమకు సంబంధించిన వివరాలు మాత్రం ఈసీకి సమర్పించరు.

ఎన్నికల సమయంలో అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఎన్నికల్లోపోటీ చేసి తమకు సంబంధించిన వివరాలు మాత్రం ఈసీకి సమర్పించరు.

  • Published Oct 21, 2023 | 11:01 AMUpdated Oct 21, 2023 | 11:01 AM
ఎన్నికల వేల EC సంచలన నిర్ణయం.. ఏకంగా 107 మందిపై అనర్హత వేటు!

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న నోటిఫికేషన్ రిలీజ్.. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండబోతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి బీ-ఫారాలు కూడా అందజేసింది. కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించగా.. బీజేపీ మాత్రం ఇప్పటికీ ఎలాంటి లీస్ట్ రిలీజ్ చేయలేదు. అంతేకాదు ఇప్పటి వరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కూడా చేయడం లేదు. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతున్న సమయంలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఎలక్షన్స్ గురించిన చర్చలే నడుస్తున్నాయి. వచ్చే నెల నుంచి ఈ హడావుడి మరింత పెరగనుంది. ఇలాంటి సమయంలో ఎన్నికల సంఘం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. తెలంగాణకు చెందిన 107 మంది అభ్యర్థులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. సదరు అభ్యర్థులు గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేసివారు. ఈ 107 మంది అభ్యర్థులు గత ఎన్నికల్లో తమ ఖర్చుకు సంబంధించిన ఎలాంటి వివరాలు ఈసీకి అందించకపోవడంతో వీరందరిని అనర్హులుగా ప్రకటించింది. ఇందులో 72 మంది లోక్ సభ స్థానాలకు పోటీ చేసిన వారైతే.. అందులోనూ ఈసీ వేటుకు గురైన వారిలో 68 మంది వరకు నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన వారు కావడం గమనార్ణం. పసుపు బోర్డు, ఇతర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆ నియోజకవర్గం నుంచి అప్పట్లో 186 మంది పోటీ చేసిన విషయం తెలిసిందే. అందులో చాలా వరకు సామాన్య రైతులే ఉన్నారు.

ఇక మిగతా వారు మహబూబాబాద్, మెదక్ నుంచి ఒక్కొక్కరు, నల్లగొండ నుంచి ఇద్దరు అనర్హులుగా ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసినట్లు ఈసీ తెలిపింది. వారు కుడా ఎన్నికల్లో పెట్టిన ఖర్చు వివరాలు ఏవీ ఈసీకి సమర్పించకపోవడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10 ఏ కింద వారందరినీ అనర్హులుగా ప్రకటించినట్లు తెలిపింది. అనర్హత వేటు పడిన వారి నల్లగొండ, ములుగు నుంచి నలుగురు, మిర్యాలగూడ నుంచి ముగ్గురు, పాలకుర్తి నియోజవర్గం నుంచి ఆరుగురు, నకిరేకల్ నుంచి ఇద్దరు, జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్ గిరి, ఆలేరు, నాగార్జుసాగర్, జనగాం, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఒకరు చొప్పున ఈ జాబితాలో ఉన్నారు. వాస్తవానికి వీరందరినీ 2021 జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే అనర్హులుగా ప్రకటించారు. 3 సంవత్సురాలు అంటే 2024 జులై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారని ఈసీ వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి