iDreamPost
android-app
ios-app

వాళ్ల ముగ్గురితో మాట్లాడుతున్నా.. వన్డేల్లో కూడా ఇరగదీస్తా: SKY

  • Published Aug 29, 2023 | 1:37 PM Updated Updated Aug 29, 2023 | 1:37 PM
  • Published Aug 29, 2023 | 1:37 PMUpdated Aug 29, 2023 | 1:37 PM
వాళ్ల ముగ్గురితో మాట్లాడుతున్నా.. వన్డేల్లో కూడా ఇరగదీస్తా: SKY

టీ20ల్లో అతను ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌. పిచ్‌ ఎలా ఉన్నా.. ఎదురుగా ఎలాంటి బౌలర్‌ ఉన్నా.. జట్టు ఎంత కఠిన పరిస్థితుల్లో ఉన్నా.. బాదడం అనే మంత్రంతోనే భారత్‌ను గెలిపించగల ఘనుడు మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. టీమిండియాలోకి లేటుగా వచ్చినా.. స్టార్‌గా మారిపోయాడు. ఇండియన్‌ క్రికెట్‌లో ఇలాంటి ఆటగాడు ఇంతవరకు లేడ్రా అనేలా పేరు సంపాదించుకున్నాడు. సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ బిరుదును తన బిరుదుగా మార్చేసుకున్నాడు. గ్రౌండ్‌లో నలుమూలకు షాట్లు కొట్టగల మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ అయ్యాడు. కానీ, ఇదంతా టీ20లకే పరిమితం అయింది.

సూర్యకుమార్‌ లాంటి మ్యాచ్‌ విన్నర్‌ను కేవలం టీ20లకే పరిమితం చేయకుండా.. వన్డేల్లో కూడా ఆడించి, కీ ప్లేయర్‌గా మార్చాలకుని హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూర్యకు అనేక అవకాశాలు ఇచ్చారు. కానీ, సూర్య మాత్రం ఆశించిన స్థాయిలో వన్డేల్లో సక్సెస్‌ కాలేకపోతున్నాడు. అయినా కూడా వన్డే వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకుని, అప్పటి వరకైనా సెట్‌ అవుతాడని తాజాగా ఆసియా కప్‌ 2023 కోసం ఎంపిక చేశాడు. అతని కంటే బెటర్‌ యావరేజ్‌ ఉన్న సంజు శాంసన్‌ లాంటి ఆటగాడిని పక్కనపెట్టి మరీ సూర్యకు ఆసియా కప్‌ టీమ్‌లో చోటిచ్చారు సెలెక్టర్లు.

సెలెక్టర్లతో పాటు టీమిండియా హెడ్‌ కోచ్‌ ద్రావిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వన్డేల్లో కూడా రాణిస్తానని, త్వరలోనే వన్డేల్లో తన అద్భుత ప్రదర్శన చూస్తారని సూర్య అంటున్నాడు. ఆసియా కప్‌ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో తన బ్యాటింగ్‌ ఇంప్రూమెంట్‌ కోసం టీమిండియా సీనియర్‌ స్టార్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అలాగే కోచ్‌ ద్రావిడ్‌తో నిరంతరం మాట్లాడుతున్నానని, వారి సలహాలు, సూచనలతో తాను వన్డేల్లో కూడా అదరగొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి సూర్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌పై కోహ్లీ ఎమోషనల్‌ కామెంట్స్‌!