iDreamPost

సురేఖ, ఉపాసనల కొత్త బిజినెస్.. ధరలు చూసి సామాన్యులు షాక్!

ఇండస్ట్రీలో నటీ నటులు మల్టీ టాలెంటర్స్. కేవలం నటనతో సరిపెట్టుకోవడం లేదు.. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇంచు మించు అందరు ఏదో ఒక వ్యాపార రంగంలో ఉన్నవారే. ఇప్పుడు చిరంజీవి సతీమణి, కోడలు సరికొత్త బిజినెస్ స్టార్ చేశారు.

ఇండస్ట్రీలో నటీ నటులు మల్టీ టాలెంటర్స్. కేవలం నటనతో సరిపెట్టుకోవడం లేదు.. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇంచు మించు అందరు ఏదో ఒక వ్యాపార రంగంలో ఉన్నవారే. ఇప్పుడు చిరంజీవి సతీమణి, కోడలు సరికొత్త బిజినెస్ స్టార్ చేశారు.

సురేఖ, ఉపాసనల కొత్త బిజినెస్.. ధరలు చూసి సామాన్యులు షాక్!

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు..కేవలం నటనే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు. అల్లు అర్జున్ వైల్డ్ వింగ్స్ బఫే అనే బార్ అండ్ రెస్టారెంట్ నడపడంతో పాటు థియేటర్ బిజినెస్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘రౌడీ బాయ్స్’ పేరుతో దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. బాలకృస్ణ, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ నటులకు సైతం థియేటర్లు ఉన్న సంగతి విదితమే. ఇక రామ్ చరణ్ నిర్మాణ సంస్థను స్థాపించడమే కాకుండా.. రైడింగ్, విమానాయాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు మెగా కుటుంబం నుండి ఇద్దరు నారీ మణులు సరికొత్త వ్యాపారాన్ని తీసుకు వచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, రామ్ చరణ్ భార్య ఉపాసన కలిసి.. ‘అత్తమ్మాస్ కిచెన్’ అనే ఫుడ్ ప్రొడక్ట్ బిజినెస్ షురూ చేశారు. ప్రస్తుతం మార్కెట్ లో ఫుడ్ బిజినెస్ మంచి డిమాండ్ ఉంది. సమయం లేకపోవడం, ఇతర కారణాలతో చాలా మంది వంట చేసుకోవడం లేదు. దీంతో బయట ఫుడ్ పై ఆధారపడుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఇన్ స్టెంట్ ఆహార ఉత్పత్తులను తీసుకు వస్తున్నారు ఈ అత్తా, కోడళ్లు. రెడీమేడ్ పౌడర్ అండ్ మిక్స్‌ను అందిస్తున్నారు. సాంప్రదాయ వంటకాలను పరిచయం చేస్తూ.. పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్, పులిహోర పేస్ట్, రసం పౌడర్ తీసుకు వచ్చారు. త్వరలో మరిన్ని ఉత్పత్తులను కూడా తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు వీరిద్దరు.

అయితే ప్రస్తుతం వీరి వెబ్ సైటలో కేవలం ఈ నాలుగు ఉత్పత్తులు లభిస్తున్నాయి. మొత్తం ఈ నాలుగు వస్తువులను కాంబో ప్యాకేజీగా అందిస్తోంది అత్తమ్మాస్ కిచెన్. ప్రొడక్ట్‌లో దేనీ పైనా క్లిక్ చేసినా.. ఈ నాలుగు ప్రొడక్ట్సే కాంబోలే కనిపిస్తున్నాయి. ఈ నాలుగు కలిపి అక్షరాలా.. రూ. 1099.00 . దీంతో అంత ధర అంటూ వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు. పోనీ వెయిట్ ఏమైనా ఎక్కువ అనుకుంటున్నారేమో కానే కాదూ..700 గ్రాములే. దీంతో ఇది మనం కొనలేమని భావిస్తున్నారు. రేట్లు చాలా దారుణమని అంటున్నారు. ప్యాకేజీ చూస్తే చాలా బాగున్నప్పటికీ .. ధరలు మాత్రం సామాన్యుడి దరిదాపుల్లో లేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుబాటు ధరల్లో ఉంటేనే సామాన్యుడు కొనగలుగుతాడని, ధరల్లో మార్పులు చేస్తే మంచిదని సూచిస్తున్నారు కొందరు.  అత్తమ్మాస్ కిచెన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ధరల వివరాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి