iDreamPost

Covid vaccine: వ్యాక్సిన్ బలవంతంగా వేయకూడదు

Covid vaccine:  వ్యాక్సిన్ బలవంతంగా వేయకూడదు

 

కరోనాకి విరుగుడుగా అనేక దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టి వారి ప్రజలందరూ తప్పనిసరిగా ఆ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించాయి. మన దేశంలో కూడా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు డాక్టర్లు కూడా చెప్పారు. ఇప్పటికే చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా వేయించుకోవాలని కేంద్రం ప్రజలని కోరుతోంది.

 

దేశంలో కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా వేగంగా చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలో చాలా ప్రదేశాలకి వెళ్ళడానికి వ్యాక్సిన్ వేయించుకుంటేనే అనుమతి ఉండటంతో వ్యాక్సిన్ తప్పనిసరి అయింది. దీనిపై వ్యాక్సిన్‌ వేసుకోవడం తప్పనిసరిగా ఉండకూడదని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాల‌ని ప్ర‌జ‌లపై ఒత్తిడి చేయ‌వ‌ద్దు. వ్యాక్సిన్ బలవంతంగా వేయకూడదు. ప్రస్తుత వ్యాక్సినేషన్‌ విధానం ఏకపక్షంగా ఉందని కూడా చెప్పలేము. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కూడా కేంద్రం డేటాను విడుదల చేయాలి. అలాగే, వ్యాక్సిన్ వేయించుకోకపోతే వారిని పబ్లిక్‌ ప్రదేశాలకు రానివ్వకపోవడం కరెక్ట్‌ కాదు అని తెలిపింది.

కొన్ని రాష్ట్రాలు, కేంద్రం వ్యాక్సిన్ తీసుకోకుండా కొన్ని ప్రదేశాలకి రానివ్వమని తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, ఆ తర్వాత వ్యాక్సిన్‌ విషయంలో ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి అమలుచేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్ట్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి