iDreamPost

50 ఏళ్ల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ తొలి ప్యాన్ వరల్డ్ మూవీ..

50 ఏళ్ల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ తొలి ప్యాన్ వరల్డ్ మూవీ..

ఇప్పుడు మనమంత ప్యాన్ ఇండియా మూవీ .. ప్యాన్ వరల్డ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. 50 యేళ్ల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ ప్యాన్ వరల్డ్ మూవీ చేసి హీరోగా, నిర్మాతగా తన సత్తా ఏంటో చూపించారు.

Mosagallaku Mosagadu: తెలుగువారి తొలి కౌబోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు..  సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి 50 ఏళ్లు.. | TV9 Telugu

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో సినిమాల విషయంలో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో రియల్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఇపుడు మనమందరం ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కృష్ణ 50 యేళ్ల క్రితమే ప్యాన్ వాల్డ్ మూవీ చేసిన ఘనత కృష్ణకే దక్కుతోంది.

 ఏడారులు, గుర్రపు ఛేజింగ్‌లు, నిధికోసం ఎత్తుకు పై ఎత్తులు, ఎంతో ఉత్కంఠ రేపే కథా కథనాలు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠభరిత సన్నివేశాలు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్స్ సీక్వెన్స్, హాలీవుడ్‌ చిత్రాలను తలదన్నే పిక్చరైజేషన్. మొత్తంగా తెలుగు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. (Photos/Twitter BARAju)

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా పద్మాలయా ఫిలింస్ బ్యానర్‌లో కే.యస్.ఆర్. దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై  5 దశాబ్దాలు అవుతోంది.  అప్పట్లోనే ఈ చిత్రం ఎన్నో రికార్డులు సాధించింది.

ఏడారులు, గుర్రపు ఛేజింగ్‌లు, నిధికోసం ఎత్తుకు పై ఎత్తులు, ఎంతో ఉత్కంఠ రేపే కథా కథనాలు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠభరిత సన్నివేశాలు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్స్ సీక్వెన్స్, హాలీవుడ్‌ చిత్రాలను తలదన్నే పిక్చరైజేషన్. మొత్తంగా తెలుగు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’.

 తెలుగులో ఓ చరిత్ర సృష్టించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం హిందీలో ‘ఖజానా’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. అక్కడ కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.  (Twitter/Photo)

సాహసానికి మారుపేరుగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి సినిమా ఎలా ఉంటుందో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాతో రుచి చూపించారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 60వ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ సినిమాతో కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ.. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రూ. 6 లక్షల 30 వేలతో నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రం.. కేవలం తమిళ డబ్బింగ్ వెర్షన్‌లోనే దాదాపు రూ. 7లక్షలు కలెక్ట్ చేసి తమిళంలో కూడా ఓ చరిత్ర సృష్టించింది.

 ఈ సినిమా దర్శకుడు కే.యస్.ఆర్.దాస్‌తో కృష్ణది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయలో ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ నుంచి ఇన్‌స్పెక్టర్ రుద్ర’ వరకు పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. అందులో ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. (Twitter/Photo)

తెలుగులో ఓ చరిత్ర సృష్టించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం హిందీలో ‘ఖజానా’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. అక్కడ కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.  ఇంగ్లీష్‌లో ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో డబ్ చేసారు. హిందీ, తమిళం, ఇంగ్లీష్‌తో పాటు రష్యన్, స్పానిష్‌తో పలు భాషల్లో డబ్ చేయబడింది. ఇలా ప్యాన్ ఇండియా కాకుండా ప్యాన్ వరల్డ్ లెవల్లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు చిత్రం అప్పటికీ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది.

అంతేకాదు  మోసగాళ్లకు మోసగాడు రికార్డు స్థాయిలో అన్ని భాషల్లో హిట్టైయింది. అంతేకాదు అప్పట్లోనే 125 దేశాల్లో రిలీజైన తొలి భారతీయ ప్యాన్ వరల్డ్  సినిమాగా సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ రికార్డు క్రియేట్ చేసింది. హీరోగా మంచి పొజిషన్‌లో ఉన్న పద్మాలయ బ్యానర్‌లో ‘అగ్ని పరీక్ష’ తర్వాత నిర్మించిన రెండో చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’.

‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని కృష్ణ .. హాలీవుడ్‌లో వచ్చిన ‘మెకన్నాస్ గోల్డ్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాల నుంచి ప్రేరణ పొంది తెలుగు నేటివిటీకి తగ్గట్టు రచయత ఆరుద్రతో కౌబాయ్ కథను రెడీ చేయించుకున్నారు.  ఈ చిత్రాన్ని ఆరుద్ర గారు.. బొబ్బిలి యుద్ధం, జరిగిన రోజుల్లో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు మన దేశంలో అడుగుపెట్టినపుడు ఉన్న సంస్థానాల  నేపథ్యంలో ఈ కథను రెడీ చేసారు.
 అప్పట్లో ‘మోసగాడు మోసగాడు’ మూవీలోని పాత్రలతో వైకుంఠపాళీ విడుదలైంది. అప్పట్లో ఇదో సంచలనం . ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ మెయిన్ విలన్ పాత్రలో నటించారు.రావు గోపాల రావు, నాగభూషణం వంటి వారు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.  (Twitter/Photo)

రూ. 6 లక్షల 70 వేలతో రాజస్థాన్‌లోని థార్ ఎడారి, బికనీర్ కోట, శివబాడి టెంపుల్, దేవీకుండ్ సాగర్, సిమ్లా, కుప్రీ, టిబెట్‌కు సమీపన గల నార్కండా ‘స్నోఫాల్’తో పాటు సట్లేజ్ నదీ తీరాన తట్టాపానీ, పాండిచ్చేరి, మద్రాస్ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేసారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి ఆది నారాయణ రావు సంగీతం అందించారు. ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక వి.యస్.ఆర్.స్వామి సినిమాటోగ్రఫీ అందించారు. ఈయన ప్రతి సన్నివేశాలన్ని తన కెమెరాలో బంధించిన తీరు ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 1972లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. దక్షిణ భారత దేశం నుంచి ఈ సినిమా మాత్రమే ఎంపిక చేయబడింది. ఈ సినిమా దర్శకుడు కే.యస్.ఆర్.దాస్‌తో కృష్ణది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయలో ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ నుంచి ఇన్‌స్పెక్టర్ రుద్ర’ వరకు పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. అందులో ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది.

కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు'.. హాలీవుడ్‌లో డబ్ చేయబడిన తొలి భారతీయ చిత్రం.. |  Super Star Krishna Vijaya nirmala mosagallaku mosagadu compltetes 49 years  entered into 50 years this movie creats ...

‘మోసగాళ్లకు మోసగాడు’ తరహాలో తెలుగులో ఆ తర్వాత ‘మంచివాళ్లకు మంచివాడు’ ’నిజం నిరూపిస్తా’ ‘మెరుపుదాడి’, కొదమ సింహం’, కౌబాయ్ నెం. 1’, ‘టక్కరి దొంగ’ వంటి పలు కౌబాయ్ చిత్రాలు తెరకెక్కాయి. అప్పట్లో ‘మోసగాడు మోసగాడు’ మూవీలోని పాత్రలతో వైకుంఠపాళీ విడుదలైంది. అప్పట్లో ఇదో సంచలనం . ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ మెయిన్ విలన్ పాత్రలో నటించారు.రావు గోపాల రావు, నాగభూషణం వంటి వారు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి