iDreamPost
android-app
ios-app

IPL 2024: విరాట్ పై గవాస్కర్ ఘాటు విమర్శలు.. కోహ్లీ నుంచి కోరుకునేది ఇది కాదంటూ..!

  • Published Apr 26, 2024 | 4:09 PM Updated Updated Apr 26, 2024 | 4:09 PM

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ కోహ్లీ బ్యాటింగ్ పై విమర్శలు గుప్పించాడు టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ కోహ్లీ బ్యాటింగ్ పై విమర్శలు గుప్పించాడు టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024: విరాట్ పై గవాస్కర్ ఘాటు విమర్శలు.. కోహ్లీ నుంచి కోరుకునేది ఇది కాదంటూ..!

ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తమ దరిద్రానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు ఓ విజయాన్ని దక్కించుకుంది. అది కూడా తమపై ఐపీఎల్ రికార్డ్ తో పాటుగా ప్రపంచ రికార్డ్ సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పై. SRH హోం గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో రెండో గెలుపు సాధించి కాస్త ఊరట చెందుతోంది బెంగళూరు టీమ్. ఇక ఈ మ్యాచ్ లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 51 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే విరాట్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు గుప్పించాడు టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. కోహ్లీ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది ఇది కాదంటూ.. విశ్లేషించాడు.

భీకరఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ టీమ్ ను వారి సొంత గడ్డపైనే 35 పరుగుల తేడాతో మట్టికరిపించింది ఆర్సీబీ. దీంతో గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం కూడా తీర్చుకున్నట్లు అయ్యింది. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 206 రన్స్ చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ తో 51 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అయితే విరాట్ కంటే వేగంగా 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు రజత్ పాటీదార్. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కోహ్లీ స్లో బ్యాటింగ్ పై విమర్శలు గుప్పించాడు. అతడి స్ట్రైక్ రేట్ ను పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Gavaskar comments on kohli

“విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కొట్టిన ఫిఫ్టీ ఎంతో విలువైనదే కాదనను. అయినా అతడి బ్యాటింగ్ తీరు ఏమంత బాలేదు. విరాట్ ఇన్నింగ్స్ లో ఎక్కువ సేపు బౌండరీలు లేకుండానే సాగింది. బ్యాటింగ్ మధ్యలో అతడు లయ కోల్పోయాడు. 31 పరుగుల నుంచి అతడు పెవిలియన్ చేరే వరకు కోహ్లీ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదనుకుంటా. ఫస్ట్ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు ఆడిన అతడు 118 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం నిజంగా ఆశ్చర్యం. విరాట్ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది ఇలాంటి బ్యాటింగ్ కాదు. రజత్ పాటీదార్ 250 స్ట్రైక్ రేట్ తో థండర్ ఫిఫ్టీ బాదాడు” అంటూ అతడితో కంపేర్ చేస్తూ కోహ్లీని విమర్శించాడు గవాస్కర్. కాగా.. ఈ సీజన్ లో విరాట్ 9 మ్యాచ్ ల్లో 430 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. మరి కోహ్లీ స్లో బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.