Somesekhar
టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆ ఐపీఎల్ ప్లేయర్ల జీతాలు కట్ చేయాలని, అప్పుడే వారు దారిలోకి వస్తారని సూచించాడు. అసలేం జరిగింది? ప్లేయర్ల జీతాలు కట్ చేయమని గవాస్కర్ ఎందుకు అంటున్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..
టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆ ఐపీఎల్ ప్లేయర్ల జీతాలు కట్ చేయాలని, అప్పుడే వారు దారిలోకి వస్తారని సూచించాడు. అసలేం జరిగింది? ప్లేయర్ల జీతాలు కట్ చేయమని గవాస్కర్ ఎందుకు అంటున్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
IPL లాంటి రిచ్ క్రికెట్ లీగ్ లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కలలు కంటూ ఉంటాడు. ఒక్క సీజన్ అయినా ఈ మెగాటోర్నీలో ఆడితే చాలని చాలా మంది యంగ్ ప్లేయర్లు అనుకుంటారు. ఎందుకంటే? ఈ టోర్నీలో ఆడితే.. డబ్బుకు డబ్బుతో పాటుగా పేరు కూడా వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఇతర దేశాల ఆటగాళ్లకు వారి సొంత క్రికెట్ బోర్డుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఇబ్బందే పలు దేశాల ప్లేయర్లకు ఎదురైంది. ఈ విషయంపై గట్టిగానే స్పందించాడు టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఆ ఐపీఎల్ ప్లేయర్ల జీతం కట్ చేయాలని, అప్పుడే వారు దారిలోకి వస్తారని సూచించాడు. అసలేం జరిగింది? ప్లేయర్ల జీతాలు కట్ చేయమని గవాస్కర్ ఎందుకు అంటున్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 2024 సీజన్ పూర్తి కాకుండానే స్వదేశాలకు వెళ్లిపోయే విదేశీ ఆటగాళ్లపై మండిపడ్డాడు టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఇలా సీజన్ పూర్తి కాకుండానే మధ్యలో వెళ్లిపోయే ప్లేయర్ల జీతాల్లో కోత విధించాలని సూచించాడు. అసలు విషయం ఏంటంటే? టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో తమ దేశ ఆటగాళ్లను ఇంగ్లండ్ కు రావాల్సిందిగా ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లండ్ తో పాటుగా ఇతర దేశాలు కూడా ఇదే విధంగా చేస్తున్నాయి. దీంతో ఈ విషయంపై తాజాగా స్పందించాడు సునీల్ గవాస్కర్.
“ప్లేయర్లు తమ తొలి ప్రాధాన్యం దేశానికి ఇవ్వడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ సీజన్ మెుత్తం ఆడతామని ఫ్రాంచైజీలతో అగ్రిమెంట్ చేసుకుని, ఇలా మధ్యలోనే వెళ్లిపోవడం ఎంత వరకు కరెక్ట్. పైగా ప్లేయర్లు దేశం తరఫున కొన్ని టోర్నీలు ఆడితే వచ్చే డబ్బుకన్నా.. ఐపీఎల్ లో ఒక్క సీజన్ లో ఆడితే వచ్చే మనీ ఎక్కువ. ఇలా మధ్యలోనే వెళ్లిపోయే ఆటగాళ్ల జీతంలో కోత విధించాలి. అదీకాక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం బోర్డలకు కమీషన్ ఇవ్వడమూ ఆపేయాలి” అంటూ ఐపీఎల్ నిర్వాహకులకు కొన్ని సూచనలు చేశాడు. మరి సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.