iDreamPost
android-app
ios-app

Kohli-Gambhir: ఆ అవార్డు KKRకే.. ఇది ఆస్కార్ లెవల్ యాక్టింగ్: దిగ్గజ ప్లేయర్లు సెటైర్లు

  • Published Mar 30, 2024 | 10:16 AM Updated Updated Mar 30, 2024 | 10:16 AM

RCB vs KKR మ్యాచ్ లో గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీ కౌగిలించుకున్న సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలు సెటైరికల్ గా స్పందించారు.

RCB vs KKR మ్యాచ్ లో గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీ కౌగిలించుకున్న సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలు సెటైరికల్ గా స్పందించారు.

Kohli-Gambhir: ఆ అవార్డు KKRకే.. ఇది ఆస్కార్ లెవల్ యాక్టింగ్: దిగ్గజ ప్లేయర్లు సెటైర్లు

క్రికెట్ లో గొడవలు జరగడం అన్నది చాలా సాధారణమైన విషయం. అయితే ప్రత్యర్థి దేశాలకు చెందిన ప్లేయర్లు గొడవలకు దిగిన సంఘటనలు మనం ఎన్నో చూశాం. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ లాంటి టీ20 లీగ్స్ వచ్చాయో.. అప్పటి నుంచి సొంత దేశ ప్లేయర్లే ఢీ అంటే ఢీ అంటున్నారు. ఐపీఎల్ చరిత్రలో కోల్ కత్తా మాజీ ఆటగాడు, మెంటర్ గౌతమ్ గంభీర్, రాయల్ ఛాలెంజర్స్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వార్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ తాజాగా కేకేఆర్-ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుంది. ఈ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీ కౌగిలించుకున్న సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలు సెటైరికల్ గా స్పందించారు.

గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీ వీరిద్దరి మధ్య గతంలో జరిగిన గొడవ ఎంత పెద్ద రచ్చకు దారితీసిందో మనందరికి తెలియనిది కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి మధ్య కోల్డ్ వార్ ఇలానే కొనసాగుతూ వస్తోంది. గంభీర్ టైమ్ దొరికినప్పుడల్లా విరాట్ పై, అతడి ఫ్యాన్స్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉంటాడు. కానీ ఏ రోజూ కోహ్లీ ఆ విమర్శలపై గానీ, గంభీర్ పైగానీ స్పందించలేదు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. చిన్నస్వామి వేదికగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆసక్తికర పోరులో 7 వికెట్లతో ఆర్సీబీని చిత్తు చేసింది కేకేఆర్. కాగా.. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అదేంటంటే? గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు మ్యాచ్ కంటే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ అనుకోని సంఘటనపై తమదైన శైలిలో స్పందించారు టీమిండియా మాజీ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలు.

రవిశాస్త్రి మాట్లాడుతూ..”బహుశా ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు. విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ హగ్ విషయంలో కేకేఆర్ టీమ్ కు ఫెయిర్ ప్లే అవార్డు దక్కుతుంది” అని చెప్పుకు రాగా.. దీనికి స్పందిస్తూ.. మరో దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. “ఫెయిర్ ప్లే అవార్డే కాదు.. ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది” అని గవాస్కర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వీరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇన్ డైరెక్ట్ గా గంభీర్ పై విమర్శలు గుప్పించారు ఈ దిగ్గజ ప్లేయర్లు. కోహ్లీ హగ్ విషయంలో గంభీర్ చాలా బాగా నటించాడని, అందుకే అతడి యాక్టింగ్ ను ఆస్కార్ అవార్డుతో పోల్చారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కోహ్లీ అందరిని కలుపుకొని వెళ్లే మనస్తత్వం కలవాడని మరికొందరు రాసుకొస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

ఇదికూడా చదవండి: RCB vs KKR: ఇలాగైతే కప్ కష్టమే! ఇది ఒక్కడి ఆట కాదు! టీమ్ గేమ్: గవాస్కర్