iDreamPost
android-app
ios-app

పేద మహిళలకు ఆర్థిక సాయం చేసిన ‘సుందరాంగుడు’ హీరో!

  • Published Sep 13, 2023 | 3:02 PM Updated Updated Sep 13, 2023 | 3:02 PM
పేద మహిళలకు ఆర్థిక సాయం చేసిన ‘సుందరాంగుడు’ హీరో!

సినీ ఇండస్ట్రీ ఓ అందమైన రంగుల ప్రపంచం అంటుంటారు. ఒక్కసారి వెండితె, బుల్లితెరపై కనిపిస్తే సెలబ్రెటీ హూదా వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా టాలెంట్ ఏంటో చూపిస్తాం అంటూ స్టూడియోల వెంట పడిగాపులు కాస్తుంటారు.  టాలెంట్ తో పాటు అదృష్టం కలిసి వచ్చిన వాళ్లు సినిమాల్లో ఛాన్సు దక్కించుకుంటారు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారికి సరైన అవకాశాలు లభించక ఒకటి రెండు సినిమాలతోనే కథ సమాప్తం అవుతుంది. అలా ఎంతోమంది నటీనటులు ఇతర రంగాల్లో స్థిరపడిపోయిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో సుందరాంగుడు నటుడు కృష్ణసాయి ఒకరు. తాజాగా నటుడు కృష్ణ సాయి పేదరికంలో ఉన్న మహిళను ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్న కొంతమంది నటీనటులు రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే. తమ అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చిన స్టార్ హీరోలు వారికి ఆర్థికంగా సాయం అందిస్తుంటారు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆస్పత్రి ఖర్చులు అందజేస్తుంటారు. నిజ జీవితంలో రియల్ హీరోలు అనిపించుకుంటారు. అలాంటి వారిలో ‘సుందరాంగుడు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన నటుడు కృష్ణ సాయి ఒకరు. హీరోగా పెద్ద సక్సెస్ సాధించకున్నా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నలుగురికి సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నాడు కృష్ణ సాయి.

నటుడు కృష్ణసాయి ‘కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించి కుల, మతాలకు అతీతంగా కష్టల్లో ఉన్న వారికి అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు పొందారు. తాజాగా పల్నాడు జిల్లా కారెంపూడి మండలానికి చెందిన పేద మహిళలకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అవసరమైతే భవిష్యత్ లో కష్టాల్లో ఉన్న గ్రామీణ మహిళలకు ఉపాధి కోసం తన ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తానని అన్నారు కృష్ణసాయి. ప్రస్తుతం కృష్ణసాయి.. ఎంఎస్‌కె ప్రమిద శ్రీ ఫలింస్ పతాకంపై ‘జ్యువెల్ థీఫ్’ మూవీలో నటిస్తున్నారు. పీఎస్ నారాయణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Girişgrandpashabet giriş