iDreamPost

Sukumar : పాపం సుకుమార్.. పరువు తీసిన సీన్ కు దణ్ణం పెట్టేశాడుగా!

Sukumar : పాపం సుకుమార్.. పరువు తీసిన సీన్ కు దణ్ణం పెట్టేశాడుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా ‘పుష్ప’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియా మూవీగా రిలీ అయిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఒకే ఒక్క సీన్ మాత్రం కాస్త అసభ్యంగా అనిపిస్తూ విమర్శలకు తావిచ్చింది.

వ్యాన్ లో కూర్చున్న పుష్ప.. శ్రీవల్లి భుజంపై చేయి వేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, అలా మాట్లాడుతూ పుష్ప చేయి శ్రీవల్లి ఎద భాగం పైకి తెలియనట్లే పెడతాడు. అయితే కుర్రకారుకు ఈ సీన్ బాగానే ఉన్నా మిగతా వారికి అది కొంచెం అతిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో వచ్చిన వారు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారని విమర్శకులు తేల్చడంతో పాటు సుకుమార్ స్థాయికి ఇది ఏమాత్రం తగని సీన్ అని తీర్పు ఇచ్చారు.

దీంతో సినిమా యూనిట్ ఆ సీన్ ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి ఈ సీన్ మూవీలో కనిపించడం లేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర కావడానికి ఇలాంటి సీన్స్ ని డిలీట్ చేయడమే బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసభ్యంగా అనిపించే సీ సీన్ తొలగిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త మొగ్గు చూపే అవకాశం ఉండటంతో తొలగించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా శనివారం దీన్ని ఎడిటింగ్ లో లేపేశారు. అయితే, ఇది అన్ని భాషల్లోనూ కట్ చేస్తారా? లేక తెలుగు కే పరిమితం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Pushpa Collections : పుష్ప కలెక్షన్స్ రిపోర్ట్ : రెండో రోజూ అక్కడ రికార్డు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి