iDreamPost

కలియుగ కర్ణుడు.. చెరుకు రసం అమ్ముతూ.. వచ్చిందంతా క్యాన్సర్‌ రోగుల కోసమే

  • Published Mar 09, 2024 | 1:54 PMUpdated Mar 09, 2024 | 1:54 PM

ప్రతిఒక్కరూ జీవితంలో ఎలా సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని ఎలా పొదుపు చేయాలని ఆలోచిస్తున్న అని తాపత్రయ పడుతుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఓ వ్యక్తి మాత్రం తాను సంపాదించిన మొత్తన్ని ఏం చేస్తున్నడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రతిఒక్కరూ జీవితంలో ఎలా సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని ఎలా పొదుపు చేయాలని ఆలోచిస్తున్న అని తాపత్రయ పడుతుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఓ వ్యక్తి మాత్రం తాను సంపాదించిన మొత్తన్ని ఏం చేస్తున్నడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Mar 09, 2024 | 1:54 PMUpdated Mar 09, 2024 | 1:54 PM
కలియుగ కర్ణుడు.. చెరుకు రసం అమ్ముతూ.. వచ్చిందంతా క్యాన్సర్‌ రోగుల కోసమే

ఈరోజుల్లో ప్రతిఒక్కరూ జీవితంలో ఎలా సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని ఎలా పొదుపు చేయాలని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే.. ప్రస్తుత కాలంలో ప్రతి మనిషికి డబ్బు అనే పెద్ద జబ్బు పట్టుకుంది. అందు చేతనే ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలి అనే తాపత్రయం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా డబ్బును సంపాదించిలి అనే తరుణంలో ఆలోచిస్తూ అందరూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డబ్బు సంపాదించడం కోసం నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది అయితే ఈ డబ్బు మీద ఉన్న మోజుతో అడ్డదారులను కూడా తొక్కుతుంటారు. మరి ఇలాంటి మనుషులు ఉన్న ఈ సమాజంలో ఓ వ్యక్తి మాత్రం తాను సంపాదించిన మొత్తం ధనాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నాడు. ఇలా ఇస్తున్నడంటే.. అతనేదో కోటీశ్వరుడు, పెద్ద కంపెనీలో పని చేస్తూ భారీగా సంపాదిస్తున్నడంటే పొరపాటే. ఎందుకంటే అతడు ఓ రోజువారి కూలీ పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ ప్రపంచంలో డబ్బు పిచ్చిగానీ, దాని సంపాదించాలనే తాపత్రయం కానీ లేని వాడంటూ ఉండరు. ఎందుకంటే..ప్రతిఒక్కరూ తాము డబ్బులు సంపాదిస్తున్న కొలది ఇంకా ఎక్కువ సంపాదించాలని కలలు కంటారు. కానీ, మణిపుర్ కు చెందిన 49 ఏళ్ల లాంగ్‌జామ్ లోకేంద్ర సింగ్ అనే వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా వారానికి 6 రోజులు పని చేసి.. ఏడవ రోజున తన సంపాదన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నాడు. ఇతడు మణిపూర్ లోని ఇంఫాల్ లో నివాసముంటున్నాడు. కాగా, లాంగ్‌జామ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరకు రసాన్ని అమ్ముతాడు.అలా ఆ జ్యూస్ లు అమ్మతూ వారమంతా సంపాదించిన మొత్తం డబ్బును ఖర్చు పెట్టకుండా.. ఆ తర్వాత వచ్చే వారం అనగా శుక్రవారం నాడు తన సంపాదనలో ప్రతి రూపాయిని క్యాన్సర్ రోగులకు విరాళంగా అందిస్తున్నాడు. ఇతరులకు సహాయం చేస్తున్న లాంగ్‌జామ్ కు దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. తాను ఇలా సంపాదించిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి కారణం కూడా వివరించాడు.

అయితే, లాంగ్‌జామ్ లోకేంద్ర సింగ్ తన సంపాదనను విరాళంగా ఇవ్వడానికి కారణం.. తన భార్య 2013లో పెద్దప్రేగు క్యాన్సర్‌ బారినపడ్డదని, ఆ సమయంలో తన భార్యకు వైద్యం చేయించుకోవడానికి సరిపడా డబ్బులు తనవద్ద లేవని, అప్పుడు నా భార్య చికిత్స సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక దురదృష్టవశాత్తు నా భార్య ఆ సంవత్సరంలో మరణించిందని తెలపాడు. అయితే తాను ఒక సాధారణ రైతునని.. అయినా తన భార్యను కాపాడడం కోసం తన ఆస్తి మొత్తాన్ని అమ్మి, ఆమెకు చికిత్స కోసం ముంబైలోని టాటా క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పాడు.ఇలా ఎన్నో ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక అలా క్యాన్సర్ తో బాధపడిన వారు ట్రీట్‌మెంట్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. తనవంతు ఏదైనా సాయం చేయాలని ఈ నిర్ణయించుకున్నానని చెబుతున్నాడు. అందుకే ఇలా తన సంపాదనను ఇలా క్యాన్సర్ రోగులకు విరాళంగా ఇస్తున్నాని తెలిపాడు. ప్రస్తుతం లాంగ్‌జామ్ లోకేంద్ర సింగ్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, తన సంపాదన మొత్తన్ని క్యాన్సర్ రోగులకు విరాళంగా ఇస్తున్న ఆ వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి