iDreamPost

టీచర్ మృతితో తల్లడిల్లిన పసి హృదయాలు.. ఓదార్చడం ఎవరి తరం కాలేదు..!

తల్లిదండ్రులకు మనకు జన్మనిస్తే.. సమాజంలో గొప్ప పొజీషన్ లోకి తీసువచ్చేది గురువులు. అందుకే గురువులను త్రిమూర్తులతో పోలుస్తారు. గురుశిష్యుల బంధం ఎంతో గొప్పంది.

తల్లిదండ్రులకు మనకు జన్మనిస్తే.. సమాజంలో గొప్ప పొజీషన్ లోకి తీసువచ్చేది గురువులు. అందుకే గురువులను త్రిమూర్తులతో పోలుస్తారు. గురుశిష్యుల బంధం ఎంతో గొప్పంది.

టీచర్ మృతితో తల్లడిల్లిన పసి హృదయాలు.. ఓదార్చడం ఎవరి తరం కాలేదు..!

పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిస్తారు. కానీ ఆ పిల్లలకు ఉన్నత విద్యనందించి సమాజంలో గొప్ప పొజీషన్ కి చేరేలా చేసేది గురువులు. అందుకే గురుకి గొప్ప స్థాయియి ఇచ్చారు. బ్రహ్మః, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరభ్రమ్మ, తస్మైశ్రీ గురవే నమః అని అంటారు పెద్దలు. విద్యనందించే గురువులను త్రిమూర్తుతో పోల్చుతారు. కొంతమంది గురువులు స్కూల్ కి వచ్చి కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాదు విద్యార్థుల వారి టాలెంట్ గుర్తించి ప్రోత్సహించడం,  ఇతర యాక్టివిటీస్ లో విద్యార్థులకు అవగాహన కల్పించడం లాంటి చేస్తూ ఉంటారు. అలాంటి గురువులను విద్యార్థులు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. తాము అభిమానించే గురువు ఇక రాడని తెలిసి విద్యార్థులు పడ్డ ఆవేదన చూసి అక్కడ టీచర్లు సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన నకిరేకల్‌ లో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే..

పాఠశాలకు రాగానే తమను రోజూ ఎంతో ఆప్యాయంగా పలకరించే టీచర్ ఇక లేడు.. తిరిగి రాడు అని తెలిసిన వెంటనే చిన్నార్లు వెక్కి వెక్కి ఏడ్చారు. స్కూల్లో తమను కన్నబిడ్డల్లా చూసుకునే సార్ ని తల్చుకొని పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి.. సార్.. సార్ రండి సార్, ఒక్కసారి కనిపించండి సార్ విద్యార్థుల రోదన అందరినీ కన్నీరు పెట్టించింది. కఠిన పాశాన హృదయాలనైనా కదిలించే ఈ ఘటన నకిరెకల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మండల పరిషత్ స్కూల్ లో బచ్చుపల్లి శ్రీనివాస రావు పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా సొంత ఇంటి మనిషిలా ఉండేవారు. విద్యార్థులను ఏనాడు దండించకుండా విద్యాబుద్దులు నేర్పించారు.. తన సొంత బిడ్డల్లా చూసుకునేవారు. విద్యార్థులను చక్కగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి గొప్ప పొజీషన్ లోకి రావాలని కోరుకునేవారు. దీంతో శ్రీనివాస్ రావు సార్ పై పిల్లలు ఎంతో అభిమానం పెంచుకున్నారు.

తాము ఎంతో అభిమానించే శ్రీనివాస్ రావు సార్ పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలోనే హెడ్ మాస్టర్ వచ్చి అనారోగ్యంతో శ్రీనివాస రావు సార్ కన్నుమూశారు.. ఆయన మనకు లేరు.. కనిపించరు అని చెప్పడంతో పిల్లలంతా ఒక్కసారే బోరున ఏడ్చారు. ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. తమ సార్ ని గుర్తుకు చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. సార్ మాకోసం ఎప్పుడూ బీరువాలో చాక్లెట్స్, బిస్కెట్లు ఉంచేవారని.. తమను బుజ్జగించేందుకు అవి ఇచ్చేవారుని, తమను ఎప్పుడూ కొట్టలేదని కన్నీరు పెట్టుకున్నారు. తాము ఎంత అల్లరి చేసినా నవ్వుతూ పలకరించేవాడని.. సున్నితంగా మందలించేవారని పిల్లలు వాపోయారు. శ్రీనివాస్ రావు అంత్యక్రియలు జరుగుతుంలో దారి పోడవునా విద్యార్థులు ఏడుస్తూ రావడం చూసి ఆ పసి హృదయాలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి