iDreamPost

Star Kids : హీరోల వారసులంటే అబ్బాయిలే కాదు

Star Kids : హీరోల వారసులంటే అబ్బాయిలే కాదు

నిన్న విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ సాంగ్ వీడియో ప్రోమో ఆన్ లైన్ లో బాగానే హల్చల్ చేసింది. అందులో మహేష్ బాబు కూతురు బేబీ సితారని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారన్న వార్త అభిమానులకు ముందే లీక్ అయ్యింది కానీ కామన్ ఆడియన్స్ మాత్రం సర్ ప్రైజ్ అయ్యారు. ఇంత త్వరగా తనను ఇలా పరిచయం చేయడం ఊహించని పరిణామం. తనకన్నా ముందే అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హని గుణ శేఖర్ తీస్తున్న శాకుంతలంతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తన పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తండ్రుల ఇమేజ్ సితార, అర్హలకు చాలా ఉపయోగపడనుంది.

అయితే ఇంత చిన్న వయసులో వీళ్ళను తెరమీద తీసుకురావడం పట్ల స్పందన ఎలా ఉన్నా ఈ ధోరణి ఒకప్పుడు ఇంకోలా ఉండేది. ఉదాహరణకు కృష్ణ గారి కూతురు ఇందిర తొలుత హీరోయిన్ గా నటించాలనుకున్నప్పుడు ఫ్యాన్స్ ఒత్తిడి మేరకు సూపర్ స్టార్ ఆ నిర్ణయాన్ని వద్దనుకున్నారు. తర్వాత షో లాంటి ఏవో ఆఫ్ బీట్ చిత్రాలు కొన్ని చేశారు కానీ ఆర్టిస్ట్ గా నిలబడాలని ఆవిడ చేసిన ప్రయత్నం పెద్ద స్థాయికి వెళ్లనివ్వలేదు. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ లాంటి సీనియర్లు ఈ కారణంగానే కూతుళ్లను స్క్రీన్ కు పరిచయం చేసే ఆలోచనను చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన డాన్స్ వీడియోలు తల్లి నమ్రతా క్రమం తప్పకుండ పోస్ట్ చేస్తుంటారు. ఇక ఫోటోల సంగతి సరేసరి. ఆ రకంగా పబ్లిక్ లైఫ్ తో తనకు ఇంటరాక్షన్ ఉంది. శాకుంతలంకు ముందే అల్లు అర్హతో ఓ మ్యూజిక్ వీడియో చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. మణిరత్నం అంజలి సినిమా టైటిల్ సాంగ్ ని అర్హ మీద ప్రత్యేకంగా షూట్ చేసి యుట్యూబ్ లో విడుదల చేశారు. ఇదంతా కెమెరా అలవాటు చేయడానికి ముందస్తు ప్రిపేరేషన్. స్టార్ వారసులంటే కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అనేలా ఇప్పటి జెనరేషన్ హీరోలు ఆలోచించడం మంచి పరిణామమే. చూద్దాం ఇంకెందరు వస్తారో

Also Read : Ghani : బ్రేక్ కోసం మెగా ప్రిన్స్ వెయిటింగ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి