iDreamPost
android-app
ios-app

టెన్త్ అర్హతతో 26, 146 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ. 69 వేల జీతం!

నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా 26 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా 26 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

టెన్త్ అర్హతతో 26, 146 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ. 69 వేల జీతం!

నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి భారీ శుభవార్త. కేవలం పదో తరగతి అర్హతతోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందొచ్చు. తాజాగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా 26 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ, రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 26,146 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో పురుషులకు 23,347, మహిళలకు 2,799 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ నవంబర్‌ 24 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://ssc.nic.in/ను సంప్రదించాలని కోరింది. మరి ఈ పోస్టులకు వయసు, అర్హత, విధివిధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

26,146

పోస్టుల వివరాలు:

  • బీఎస్‌ఎఫ్‌- 6174
  • సీఐఎస్‌ఎఫ్‌- 11025
  • సీఆర్‌పీఎఫ్‌ – 3337
  • ఎస్‌ఎస్‌బీ – 635
  • ఐటీబీపీ – 3189
  • ఏఆర్ – 1490
  • ఎస్‌ఎస్‌ఎఫ్‌ – 296

అర్హత:

  • అభ్యర్థులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి :

  • 01.01.2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్ విధానం:

  • ఆన్‌లైన్‌

అప్లికేషన్ ఫీజు:

  • పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

వేతనం:

  • ఎంపికైన వారికి రూ.21,700 నుంచి రూ.69,100 వరకు గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది

ఎంపిక ప్రక్రియ:

  • కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ:

24-11-2023

అప్లికేషన్ కు చివరి తేదీ:
31-12-2023

ఫీజు చెల్లించడానికి చివరితేది:

01-01-2024

అప్లికేషన్ సవరణ:

జనవరి 4, 2024 నుంచి జనవరి 6, 2024 వరకు

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష:

ఫిబ్రవరి – మార్చి, 2024

స్టాఫ్ సెలెక్షన్ అధికారిక వెబ్ సైట్:

https://ssc.nic.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి