iDreamPost

శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న మెట్ల మార్గం

ఈక్రమంలో శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 1 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి మెట్ల మార్గానికి మరమ్మత్తులు చేస్తుండడంతో ప్రస్తుతం భక్తులు అందుబాటులో ఉన్న అలిపిరి నడకమార్గం ద్వారానే పైకి వెళుతున్నారు.

ఈక్రమంలో శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 1 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి మెట్ల మార్గానికి మరమ్మత్తులు చేస్తుండడంతో ప్రస్తుతం భక్తులు అందుబాటులో ఉన్న అలిపిరి నడకమార్గం ద్వారానే పైకి వెళుతున్నారు.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న మెట్ల మార్గం

శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త తెలిపింది. 2021 నవంబర్ లో భారీగా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్లమార్గం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఆ మార్గానికి మరమ్మత్తులు చేపట్టిన టీటీడీ ఆ మార్గాన్ని వచ్చే నెల మొదటి నుంచి తెరుస్తోంది.

భారీగా కురిసిన వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గాన్ని ఐదునెలల నుంచి టీటీడీ మూసివేసింది. దానికి మరమ్మత్తులు చేపట్టింది. ఈక్రమంలో శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 1 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి మెట్ల మార్గానికి మరమ్మత్తులు చేస్తుండడంతో ప్రస్తుతం భక్తులు అందుబాటులో ఉన్న అలిపిరి నడకమార్గం ద్వారానే పైకి వెళుతున్నారు. తాగా శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులోకి రానున్న క్రమంలో భక్తులు ఈ మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు.

భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునేందుకు ఆసక్తి చూపుతారు. కాగా, శ్రీవారి మెట్టు నడకమార్గం అందుబాటులో వచ్చాక, కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను కేటాయిస్తామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోందని, టీటీడీ సిబ్బంది అన్ని ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉన్నారని ఆయన వివరించారు.

ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు 5,29,966 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని ధర్మారెడ్డి అన్నారు. లగేజీ కేంద్రాల నిర్వహణ కాంట్రాక్టును ప్రైవేటు కంపెనీకి త్వరలో ఇవ్వనున్నామని ధర్మారెడ్డి చెప్పారు.

తిరుమలలో పూర్వపు పరిస్థితి నెలకొందని, నేటి నుండి విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునరుద్ధరించినట్లు ధర్మారెడ్డి తెలిపారు. స్లాటెడ్ సర్వదర్శనం మళ్ళీ అమలు చేసే యోచనలో ఉన్నామని ఆయన చెప్పారు. గత 7 రోజుల్లో 46,419 వాహనాలు కొండపైకి వచ్చాయని, హుండీ ఆదాయం మొత్తం రూ.32.49 కోట్లు వచ్చిందని వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి