iDreamPost
android-app
ios-app

భర్త ఉండగా పరాయి వాడితో ప్రేమాయణం! అడ్డుగా ఉన్నాడని..!

  • Published Aug 14, 2023 | 2:53 PM Updated Updated Aug 14, 2023 | 2:53 PM
  • Published Aug 14, 2023 | 2:53 PMUpdated Aug 14, 2023 | 2:53 PM
భర్త ఉండగా పరాయి వాడితో ప్రేమాయణం! అడ్డుగా ఉన్నాడని..!

ఈ రోజుల్లో కొందరు దంపతులు కట్టుకున్నవాళ్లను కాదని పరాయి వాళ్లతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ సొంత కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ మహిళా.. తాళికట్టిన భర్త ఉండగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక భర్తకు తెలియకుండా ప్రియుడితో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. అలా కొన్నాళ్ల పాటు ప్రియుడితో తెర వెనుక సంసారాన్ని కొనసాగించింది. కట్ చేస్తే.. అదే మహిళ ప్రియుడితో చేతులు కలిపి భర్త హత్యకు సహకరించింది చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పరిధిలోని వరిసాం గ్రామంలో బాలకృష్ణ (35)-సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. ఇక భర్త స్థానికంగా కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే స్థానికంగా ఉన్న కంబాల వెంకట రమణ అనే వ్యక్తి బాలకృష్ణ భార్య సునీతతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. భర్తకు తెలియకుండా సునీత ఈ వ్యవహారాన్ని సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ వచ్చింది. ఇక వెంకటరమణ ప్రియురాలి సాయంతో ఆమె భర్త బాలకృష్ణను హత్య చేయాలని అనుకున్నాడు. దీనికి ఆమె కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో భాగంగానే ప్రియుడు వెంకటరమణ ఓ ప్లాన్ గీశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెంకటరమణ తన స్నేహితులతో కలిసి బాలకృష్ణను నమ్మించి ఓ చోట మద్యం సేవించడానికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్నాక బాలకృష్ణకు అతిగా మద్యం తాగించారు. అనంతరం వెంకటరమణ తన స్నేహితులతో కలిసి బాలకృష్ణను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాలకృష్ణ గుండెపోటుతో మరణించాడని భార్య అందరినీ నమ్మించింది. అందరూ ఇదంతా నిజమే అనుకున్నారు. ఇక ఎందుకో బాలకృష్ణ మృతిపై అనుమానం రావడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఎట్టకేలకు బాలకృష్ణది సహజ మరణం కాదని తేలింది. వెంకటరమణ, అతని స్నేహితులు కలిసి అతడిని హత్య చేసినట్లుగా తాజాగా వెంకటరమణ పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు. ఇతని హత్యకు మృతుడి భార్య సునీత కూడా సహకరించినట్లుగా వెల్లడైంది. దీంతో పోలీసులు మృతుని భార్య సునీతతో పాటు వెంకటరమణ, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: ఎన్నో కలలు కంది.. కానీ, జీవితం ఇలా అర్థాంతరంగా..

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş