iDreamPost

Sridevi birth anniversary: బాలీవుడ్ వెలుగు జిలుగుల నుంచి కుమార్తెలు జాన్వీ కపూర్ ఖుషీలను ఎలా శ్రీదేవీ కాపాడుకుందంటే!

మీడియాకు, మూవీ గ్లామ‌ర్ కు దూరంగా పెంచింది. అందుకే ఆమె ఉన్నంత‌కాలం జాన్వీ క‌పూర్ ఫోటోలు చాలా త‌క్కువ‌గానే బైట‌కొచ్చాయి. ఒక‌వేళ మీడియా ముందుకొచ్చినా, వాళ్ల‌తోపాటే తానూ ఉంది. త‌న గ్రేస్ తో వాళ్ల‌ను కాపాడుకుంది.

మీడియాకు, మూవీ గ్లామ‌ర్ కు దూరంగా పెంచింది. అందుకే ఆమె ఉన్నంత‌కాలం జాన్వీ క‌పూర్ ఫోటోలు చాలా త‌క్కువ‌గానే బైట‌కొచ్చాయి. ఒక‌వేళ మీడియా ముందుకొచ్చినా, వాళ్ల‌తోపాటే తానూ ఉంది. త‌న గ్రేస్ తో వాళ్ల‌ను కాపాడుకుంది.

Sridevi birth anniversary: బాలీవుడ్ వెలుగు జిలుగుల నుంచి కుమార్తెలు జాన్వీ కపూర్ ఖుషీలను ఎలా శ్రీదేవీ కాపాడుకుందంటే!

దివంగత నటి జయంతి రోజున‌, బాలీవుడ్ మొదటి లేడీ సూపర్‌స్టార్ గురించి ఇప్ప‌టికీ ఎందుకు మాట్లాడుకొంటున్నారు?

శ్రీదేశీ ఎంత గ్లామ‌ర‌స్, టాలెంటెడ్ స్టార్ అయినా, బాలీవుడ్ ను ఏలినా, కుటుంబం విష‌యానికి వ‌చ్చేస‌రికి ఆమె అచ్చ‌మైన తెలుగుంటి అమ్మ‌లానే ప్ర‌వ‌ర్తించింది. కుమార్తెలు జాన్వి, ఖుషీ కపూర్‌లకు ఆమె ర‌క్ష‌ణ క‌వ‌చంలాగే నిలిచింది. వాళ్లెంత సాధించినా, ఎంత ఎదిగినా త‌ల్లిలేని లోటు మాత్రం అలా క‌నిపిస్తూనే ఉంటుంది. ఇటీవ‌ల‌ జాన్వి ఎంత‌లా క‌పూర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా, లేడీ సూప‌ర్ స్టార్ శ్రీదేవీ కూతురుగానే సినిమా గుర్తుపెట్టుకుంటుంది.

శ్రీదేవీ నటిగా క‌న్నా చాలా ప్రొటెక్టీవ్ మ‌ద‌ర్ గానే క‌నిపించింది. అమ్మ‌గా త‌న పాత్ర‌ను గొప్పగా పోషించ‌డానికి ప్ర‌య‌త్నించింది. శ్రీదేవీ అన‌గానే ఆమె గ్లామ‌ర్, డాన్స్, యాక్టింగ్ గురించే ఎక్కువ‌గా మాట్లాడుకొంటాం. కాని స్టార్ గా ఎదుగుతున్న‌ప్పుడు తాను అనుభ‌వించిన క‌ష్టం, వేద‌న త‌న కుతుళ్లు ప‌డ‌కూడ‌ద‌నుకుంది. వాళ్ల భ‌విష్య‌త్తుకోసం ఆమె చేయ‌గలిగింది చేసింది. ఆమె ఓ అద్భుత‌మైన‌ న‌టి, అంత‌క‌న్నా ఓ ప‌రిపూర్ణ‌మైన త‌ల్లి.

శ్రీదేవి ఎప్పుడూ త‌న కూతుళ్లు తనలాగే హీరోయిన్స్ కావాల‌ని కోరుకోలేదు. లేటెస్ట్ గా, జాన్వీ కపూర్ తన తల్లి తనను నటిగా కాకుండా డాక్టర్ కావాలని ఎందుకు కోరుకొందో కూడా చెప్పింది. జాన్వీకి సొంత వ్య‌క్తిత్వం, జీవితం కావాల‌నుకుంది శ్రీదేవి. అదే జాన్వీకి నటనపై ఆసక్తి ఉందని తెలిసిన రోజు ఆమెకు అండగా నిలిచింది. హీరోయిన్ గా తీర్చిదిద్దింది. బాలీవుడ్ అరెంగ్రేటానికి బాట‌లువేసింది.

ఇప్ప‌టి స్టార్ కిడ్స్ లా ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో, బాలీవుడ్ గాసిప్ప్ లో జాన్వీ ఉంట‌డానికి శ్రీదేవీ ఇష్ట‌ప‌డ‌లేదు. మీడియాకు, మూవీ గ్లామ‌ర్ కు దూరంగా పెంచింది. అందుకే ఆమె ఉన్నంత‌కాలం జాన్వీ క‌పూర్ ఫోటోలు చాలా త‌క్కువ‌గానే బైట‌కొచ్చాయి. ఒక‌వేళ మీడియా ముందుకొచ్చినా, వాళ్ల‌తోపాటే తానూ ఉంది. త‌న గ్రేస్ తో వాళ్ల‌ను కాపాడుకుంది. ఒక‌నాడు Janhvi fashion eventలో త‌న త‌ల్లిని పోజు ఇవ్వ‌మ‌ని, తానుకూడా ఫ్యాష‌న్ ఈవెంట్ లో పాల్గొంటాన‌ని చెప్పినా, శ్రీదేవీ కాదంది. ఎప్పుడూ, ఎక్క‌డా అవ‌స‌రానికి మించి జాన్వీని మీడియాలో ఫోక‌స్ కానివ్వ‌లేదు. ఆమెకు తెలుసు మీడియా మోతాదు ఎంతుండాలో!

How Sridevi protected daughters Jhanvi Kapoor Khushi from Bollywood luminaries
Sridevi మ‌ర‌ణం త‌ర్వాత జాన్వికి Arjun Kapoor, Anshula Kapoorల కుటుంబం అండ‌దొరికింది. వాళ్ల‌కు బాలీవుడ్ లో క్రేజ్ వ‌చ్చింది. అయినా త‌ల్లిలేని లోటుగురించి వాళ్లు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ద‌టీజ్ శ్రీదేవి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి