Nidhan
క్రికెట్లో పసికూన స్థాయి నుంచి టెస్ట్ నేషన్ స్థాయికి ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్. ఇటీవల కాలంలో సంచలన విజయాలతో అందర్నీ ఇంప్రెస్ చేస్తోంది.
క్రికెట్లో పసికూన స్థాయి నుంచి టెస్ట్ నేషన్ స్థాయికి ఎదిగింది ఆఫ్ఘానిస్థాన్. ఇటీవల కాలంలో సంచలన విజయాలతో అందర్నీ ఇంప్రెస్ చేస్తోంది.
Nidhan
మ్యాచ్ ఫిక్సింగ్.. క్రికెట్‌ను ఈ పెనుభూతం ఎన్నాళ్లుగానో పట్టి పీడిస్తోంది. జలగలా జెంటిల్మన్ గేమ్‌ను వెంటాడుతోంది. దీని వల్ల కొందరు ఆటగాళ్ల కెరీర్ క్లోజ్ అయింది. ప్లేయర్లు పత్తా లేకుండా పోవడమే కాదు.. ఏకంగా జట్ల మీద బ్యాన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఫిక్సింగ్‌ను నిర్మూలించడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎన్నో చర్యలు చేపడుతోంది. ఫిక్సింగ్ చేయాలంటూ ఎవరైనా కలసినా వెంటనే చెప్పాలని ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చింది. ఫిక్సింగ్‌ను అరికట్టేందుకు ప్రతి మ్యాచ్‌పై నిఘా కూడా వేస్తోంది. దీంతో చాలా మటుకు ఇది తగ్గిపోయింది. కానీ ఎక్కడో ఒక చోట ఫిక్సింగ్ ఆరోపణలు రావడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ టీమ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఆ దేశమే ఆఫ్ఘానిస్థాన్. అసలు ఈ విషయంలో ఆఫ్ఘాన్ పేరు ఎందుకు వినిపిస్తుందో ఇప్పుడు చూద్దాం..
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంకతో రెండో మ్యాచ్‌లో తలపడింది ఆఫ్ఘాన్. అయితే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 10 పరుగుల తేడాలో చివరి 8 వికెట్లను కోల్పోయింది. 308 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ టీమ్ 33.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 2 వికెట్లకు 143 పరుగులతో పటిష్టంగా కనిపించింది. మ్యాచ్‌లో మ్యాజిక్ ఖాయమని అంతా అనుకుంటున్న వేళ 5 ఓవర్ల గ్యాప్‌లో చివరి 8 వికెట్లు కోల్పోయింది. 155 పరుగుల భారీ తేడాతో ఓడింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది లంక. అయితే ఈ మ్యాచ్ చుట్టూ వివాదం నెలకొంది.
విజయం దిశగా దూసుకెళ్తున్న ఆఫ్ఘానిస్థాన్ అంత చిత్తుగా ఓడటం.. 10 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోవడంతో ఆ టీమ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నేళ్ల కింద వరకు క్రికెట్లో పసికూనగా ఉన్న ఆఫ్ఘాన్ తక్కువ వ్యవధిలో టెస్ట్ నేషన్ స్థాయికి ఎదిగింది. గతేడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి బడా టీమ్స్‌ను కంగుతినిపించింది. టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను కూడా ఓడించినంత పని చేసింది. ఆ టోర్నీలో లంక మీద కూడా గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆఫ్ఘాన్. అలాంటి టీమ్ ప్రస్తుత సిరీస్‌లో వరుస మ్యాచుల్లో ఓడిపోవడం, రెండో వన్డేలో 10 పరుగుల గ్యాప్‌లో ఏకంగా 8 వికెట్లు కోల్పోవడంతో ఆ టీమ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సెకండ్ వన్డేలో ఆఫ్ఘానిస్థాన్ ఫిక్సింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ జట్టు బ్యాటర్లు చెత్త షాట్లు కొట్టి ఔటైన తీరు కూడా దీనికి ఊతమిస్తోందని తెలుస్తోంది. అయితే ఆ టీమ్ ఫ్యాన్స్ మాత్రం అలాంటిదేదీ లేదని.. ఆఫ్ఘాన్‌ను అనుమానించొద్దని అంటున్నారు. అదో బ్యాడ్ డే అని.. క్రికెట్లో ఇలా టీమ్స్ అనూహ్యంగా కుప్పకూలడం అప్పుడప్పుడూ జరిగేదేనని చెబుతున్నారు. అయితే ఈ వివాదంలో నిజానిజాలు ఏంటనేది కాలమే బయటపెట్టాలి. మరి.. ఆఫ్ఘాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందంటూ వ్యక్తం అవుతున్న అనుమానాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ సీక్రెట్ చెబితే CSKలో నుంచి పీకేస్తారు! ధోని షాకింగ్ కామెంట్స్
Afghanistan CRASH from 143-2 to 153-10 🤯
Wanindu Hasaranga takes four & Sri Lanka take the series with a 2-0 lead #SLvAFG
▶️https://t.co/cmFODlerrO pic.twitter.com/BOelwkRrYV
— ESPNcricinfo (@ESPNcricinfo) February 11, 2024