SNP
SNP
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ పరువు పోయేలా చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయి.. నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. దాంతో పాటు బాబర్ అజమ్ సెంచరీ ఫేక్ అంటూ కూడా నెటిజన్లు, క్రికెట్ అభిమానులు బాబర్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాబర్ అజమ్ శ్రీలంక క్రికెట్ బోర్డు ఆధ్వారంలో జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్‌లో కోలంబో స్ట్రైకర్స్ జట్టు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.
సోమవారం కోలంబో స్ట్రైకర్స్-గాలే టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజమ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 189 పరుగుల భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో గాలే బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. 59 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 104 పరుగులు చేసి కోలంబో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. బాబర్ అజమ్ ఆడిన ఇన్నింగ్స్ లంక క్రికెట్ బోర్డు తమ అఫిషీయర్ ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ మ్యాచ్‌లో బాబర్ ఆడిన కొన్ని సూపర్‌షాట్స్‌తో ఉందా వీడియో అయితే.. అందులో బాబర్ అజమ్ కేవలం 39 బంతుల్లోనే 104 పరుగులు చేసినట్లు చూపించారు. కానీ, నిజానికి బాబర్ 59 బంతుల్లో 104 పరుగులు చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు.. అటూ బాబర్‌ను, ఇటు లంక బోర్డును ఇద్దర్ని ట్రోల్ చేస్తున్నారు. సెంచరీ చేస్తే మంచిదే కానీ.. ఇలా అబద్ధం చెప్పుకుంటే ఎలా అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఇందులో పాపం బాబర్ తప్పు ఏం లేకపోయినప్పటికీ.. అతని సూపర్ ఇన్నింగ్స్‌కు లంక బోర్డు ట్విట్టర్ హ్యాండిల్ కళంకం తెచ్చింది. చిన్న పొరపాటుతో సోషల్ మీడియాలో బాబర్ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలే టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు భారీ స్కోర్ చేసింది. డానియల్ 49, సీఫెర్ట్ 54 పరుగులతో రాణించారు. ఇక టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఓపెనర్ బాబర్ అజమ్ సెంచరీతో చెలరేగడంతో కోలంబో 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి విజయం సాధించింది. బాబర్‌తో పాటు మరో ఓపెనర్ నిస్సంకా 54 రన్స్‌తో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో బాబర్ సెంచరీతో పాటు లంక బోర్డు చేసిన పొరపాటుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Witnessing greatness on the pitch! Babar Azam smashes the first century this season, showcasing his incredible batting prowess. @babarazam258
🏏⭐#LPL2023 pic.twitter.com/Sg4bAaLG9y— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 7, 2023
ఇదీ చదవండి: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గెలిచిన క్రికెటర్‌కు అరెకరం భూమి! అది కూడా అమెరికాలో..