iDreamPost
android-app
ios-app

SRHతో మ్యాచ్.. అసలు బలహీనతను బయటపెట్టుకున్న రాజస్థాన్!

SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంతో బలంగా కనిపిస్తోంది. వరుసగా విజయాలతో దూసుకెళ్తోంది. కానీ, ఆ జట్టుకు ఉన్న అత్యంత బలహీనత ఏంటో మరోసారి బయట పడింది.

SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంతో బలంగా కనిపిస్తోంది. వరుసగా విజయాలతో దూసుకెళ్తోంది. కానీ, ఆ జట్టుకు ఉన్న అత్యంత బలహీనత ఏంటో మరోసారి బయట పడింది.

SRHతో మ్యాచ్.. అసలు బలహీనతను బయటపెట్టుకున్న రాజస్థాన్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాజస్థాన్ రాయల్స్ హవా కొనసాగుతోంది. ఈ ఏడాది టేబుల్ టాపర్స్ గా మంచి దూకుడు మీద ఉన్నారు. అయితే ఈ జట్టు చెత్త రికార్డులను కూడా నమోదు చేస్తోందని తెలుసా? ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు తమ అసలు బలహీనత ఏంటో బయట పెట్టుకుంది. అసలు ఒక్క హైదరాబాద్ తో మ్యాచ్ లోనే కాదు.. గత 5 మ్యాచుల్లో రాజస్థాన్ పరిస్థితి అలాగే ఉంది. కానీ, దానిని అధిగమించే ప్రయత్నం మాత్రం రాజస్థాన్ జట్టు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇలాగే కొనసాగితే ఆ బలహీనతతో రాజస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావచ్చు.

ఉప్పల్ వేదికగా రాజస్థాన్- హైదరాబాద్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. తొలుత కాసేపు కట్టడి చేసిన రాజస్థాన్ జట్టు బౌలర్లు ఆ తర్వాత హైదరాబాద్ దూకుడుకు సరండర్ అయిపోయారు. ముఖ్యంగా నితీశ్ రెడ్డి(76*), ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42) విజృంభించారు. అభిషేక్ శర్మ(12), అన్మోల్ ప్రీత్(5) ఆకట్టుకోలేకపోయారు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు అసలు, సిసలు బలహీనత బయట పడింది. అన్ని జట్ల మీద విజయం సాధిస్తూ దూకుడు మీదన్న రాజస్థాన్ కు ఇది నిజంగా తప్పక వదిలించుకోవాల్సిన తలనొప్పే.

విషయం ఏంటంటే.. రాజస్థాన్ జట్టు స్పిన్నర్స్ యూనిట్ చాలా బలహీనంగా మారిపోతోంది. ముఖ్యంగా వారి ఓవరాల్ ఓవర్స్ ఎకానమీ రేటు దారుణంగా పడిపోతోంది. 2022 నుంచి రాజస్థాన్ జట్టు స్పిన్నర్లు దారుణంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. టాప్ 6 ఎకానమీ రేట్ చూస్తే.. వరస్ట్ గా ఉన్న టాప్ 5 ఈ సీజన్లో నమోదు అయినవే. బ్యాటింగ్, పేస్ యూనిట్ బలంతో రాజస్థాన్ నెట్టుకొస్తున్నట్లు అనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ జట్టు మీద 9.80 ఎకానమీ రేట్ ని నమోదు చేసింది. నిజానికి ఎంతో బలంగా ఉన్న రాజస్థాన్ జట్టుకు స్పిన్ యూనిట్ కాస్త తలనొప్పిగానే మారుతోంది. హైదరాబాద్ జట్టు చేసిన ఈ భారీ స్కోర్ లో స్పిన్నర్స్ నే ఎక్కువ బాదేశారు. ముఖ్యంగా చాహల్ ను ట్రావిస్ హెడ్, నితీశ్ ఆడేసుకున్నారు. ఒక ఓవర్లో 18, మరో ఓవర్లో 21 పరుగులు రాబట్టారు. కాబట్టి టైటిల్ టార్గెట్ గా దూసుకెళ్తున్న రాజస్థాన్ జట్టు ఈ స్పిన్ ఫాల్ట్ ని ఓవర్ కమ్ చేయకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు. మరి.. రాజస్థాన్ బలహీనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.