iDreamPost

నిన్న స్టార్క్ ఫామ్​లోకి రావడానికి హెడ్ కారణమా? వీరి కోల్డ్ వార్ వీడియో వైరల్!

  • Published May 22, 2024 | 7:57 PMUpdated May 22, 2024 | 8:45 PM

ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్​లో చెత్త బౌలింగ్​తో విమర్శలపాలయ్యాడు మిచెల్ స్టార్క్. 25 కోట్లకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాడని.. ఇలాంటోడు టీమ్​లో ఉండటం దండగ అని ట్రోలింగ్​కు గురయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్​తో అతడు హీరో అయిపోయాడు.

ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్​లో చెత్త బౌలింగ్​తో విమర్శలపాలయ్యాడు మిచెల్ స్టార్క్. 25 కోట్లకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాడని.. ఇలాంటోడు టీమ్​లో ఉండటం దండగ అని ట్రోలింగ్​కు గురయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్​తో అతడు హీరో అయిపోయాడు.

  • Published May 22, 2024 | 7:57 PMUpdated May 22, 2024 | 8:45 PM
నిన్న స్టార్క్ ఫామ్​లోకి రావడానికి హెడ్ కారణమా? వీరి కోల్డ్ వార్ వీడియో వైరల్!

ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు మిచెల్ స్టార్క్. మినీ ఆక్షన్​లో అతడి కోసం ఎన్నో జట్లు పోటీపడ్డాయి. కానీ ఏకంగా రూ.25 కోట్ల భారీ ధర చెల్లించి మరీ సొంతం చేసుకుంది కోల్​కతా నైట్ రైడర్స్. గత కొన్ని సీజన్లుగా సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లేదు కేకేఆర్. దీంతో ఆ టీమ్ రాత మార్చేస్తాడని స్టార్క్​పై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ గ్రూప్ స్టేజ్​లో చెత్త బౌలింగ్​తో విమర్శల పాలయ్యాడతను. 25 కోట్లకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. వికెట్లు తీయకపోగా.. భారీగా రన్స్ లీక్ చేస్తూ జట్టుకు భారం అయ్యాడు. దీంతో అతడు టీమ్​లో ఉండటం దండగ అని విమర్శలు వచ్చాయి. అయినా గంభీర్ అతడ్ని కంటిన్యూ చేశాడు. టీమ్ మేనేజ్​మెంట్​ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని స్టార్క్ వమ్ము చేయలేదు.

ఈ సీజన్​లో తన మీద వస్తున్న విమర్శలకు ఒక్క మ్యాచ్​తో చెక్ పెట్టాడు స్టార్క్. సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన క్వాలిఫయర్స్​-1లో 3 వికెట్లతో చెలరేగాడీ ఆసీస్ స్పీడ్​స్టర్. ఒక్క మ్యాచ్​తో అతడు హీరో అయిపోయాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సహా నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ వికెట్లు తీశాడు స్టార్క్. దీంతో ఎస్​ఆర్​హెచ్ కోలుకోలేకపోయింది. స్టార్క్ సూపర్ స్పెల్​తో మ్యాచ్​పై పట్టు బిగించిన కోల్​కతా.. మ్యాచ్ ఆసాంతం దాన్నే కంటిన్యూ చేసి విక్టరీ కొట్టింది. నిన్నటి మ్యాచ్​లో హెడ్​ను స్టార్క్ ఔట్ చేసిన తీరు హైలైట్​గా మారింది. భీకర ఫామ్​లో ఉన్న ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్​ను ఇన్నింగ్స్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు స్టార్క్. అద్భుతమైన ఔట్ స్వింగ్ డెలివరీతో అతడి ఆటకట్టించాడు. ఇన్నాళ్లూ ఫెయిలైన స్టార్క్.. నిన్న అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎవరూ నమ్మలేకపోతున్నారు.

ఈ సీజన్ మొత్తం దారుణంగా బౌలింగ్ చేసిన స్టార్క్.. మళ్లీ ఫామ్ అందుకోవడానికి హెడ్ కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉండటమే దీనికి కారణమని వినిపిస్తోంది. ఈ ఇద్దరు ఆసీస్ స్టార్లు దేశానికి కలసి ఆడతారు. కానీ బయటకు కనిపించని రైవల్రీ వీళ్ల మధ్య చాన్నాళ్లుగా ఉందని తెలుస్తోంది. అయితే అది గ్రౌండ్​కే పరిమితమట. గతంలో పలు లీగ్స్​తో పాటు ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నీల్లో స్టార్క్-హెడ్ ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారట. నెట్టింట వైరల్ అవుతున్న పాత వీడియోలు చూస్తే హెడ్​ను ఔట్ చేయడం స్టార్క్​కు అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది. ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్ వీక్​నెస్ తెలుసు, ఎలాంటి బంతిని వేస్తే అతడి ఆటకట్టించొచ్చు తెలుసు కాబట్టే మళ్లీ ఫామ్​లోకి రావడానికి నిన్నటి మ్యాచ్​ను స్టార్క్ ఉపయోగించుకున్నాడని తెలుస్తోంది. హెడ్​తో ఉన్న కోల్డ్ వార్‌‌ తనకు మంచే చేసిందని అతడు భావిస్తున్నాట. మరి.. హెడ్-స్టార్క్ రైవల్రీపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sãthìßh Kärthî (@kettava_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి