Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఆటగాడిపై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎస్ఆర్హెచ్లోని ఆ ప్లేయర్ పక్కా ఇండియాకు ఆడతాడని అన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఆటగాడిపై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎస్ఆర్హెచ్లోని ఆ ప్లేయర్ పక్కా ఇండియాకు ఆడతాడని అన్నాడు.
Nidhan
గత కొన్ని సీజన్లుగా చెత్తాటతో అందరికీ విసుగు తెప్పించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వరుస సీజన్లలో ఫెయిలవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు మూటగట్టుకుంది. దీంతో సొంత అభిమానుల నుంచి కూడా మద్దతు కరువైంది. కానీ ఒక్క సీజన్ గ్యాప్‌లో అంతా మారిపోయింది. ఐపీఎల్-2024లో అద్భుతమైన ఆటతీరుతో అలరిస్తోంది ఆరెంజ్ ఆర్మీ. 250 ప్లస్ స్కోర్లను కూడా అవలీలగా బాదేస్తూ అపోజిషన్ టీమ్స్‌ను వణికిస్తోంది. ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్‌కు ఇంకో అడుగు దూరంలో నిలిచిన ఎస్ఆర్హెచ్ ఇంత సక్సెస్ అవడానికి టీమ్‌లోని సీనియర్లతో పాటు పలువురు కుర్ర ప్లేయర్లు కూడా కారణమని చెప్పాలి. వారిలోని ఒకరి గురించి ఎయిడెన్ మార్క్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సన్‌రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను ప్రశంసల్లో ముంచెత్తాడు జట్టు మాజీ సారథి మార్క్రమ్. అతడు సూపర్ టాలెంటెడ్ అని మెచ్చుకున్నాడు. అభిషేక్ త్వరలో టీమిండియాకు ఆడతాడని జోస్యం పలికాడు. ఎంతటి బాధ్యతను అప్పగించినా దాన్ని స్వీకరించడానికి అతడు సిద్ధంగా ఉంటాడని అన్నాడు. ‘ఈ సీజన్లో అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. అతడు చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాడు. ఎంతటి బాధ్యతను మోయడానికైనా అతడి భుజాలు రెడీగా ఉంటాయి. అతడు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి వెళ్తాడు’ అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో వివాదాస్పదంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మీద కూడా మార్క్రమ్ రియాక్ట్ అయ్యాడు. ఈ రూల్‌లో తప్పేమీ లేదని.. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపాడు. టీమ్ బ్యాటింగ్ యూనిట్లో ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటే చాలా స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝళిపించొచ్చని అభిప్రాయపడ్డాడు మార్క్రమ్. ఇంపాక్ట్ రూల్ వల్ల అదనంగా మరో బ్యాటర్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని, కాబట్టి ఔటైనా ఎక్స్ట్ట్రా బ్యాటర్ ఉన్నాడనే ఉద్దేశంతో ఓపెనర్లు ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్‌కు దిగుతున్నారని పేర్కొన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల టీ20 క్రికెట్ మరింత ఎంటర్టైనింగ్గా మారిందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో ఇది ఊహించని మార్పులు తీసుకొచ్చిందని వివరించాడు. మరి.. అభిషేక్ శర్మ భారత్‌కు ఆడతాడంటూ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Aiden Markram said, “Abhishek Sharma has made massive strides this season. He’s got a very calm and level head on his shoulders and he’ll take everything in his stride. But my fingers are certainly crossed for him to go to higher honours”. (PTI). pic.twitter.com/1D6RFGuBmd
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 15, 2024