iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: వీడియో: లైవ్​లో ఇది చూసుండరు.. బుమ్రా విలువేంటో చెప్పే సీన్ ఇది!

  • Published Apr 12, 2024 | 6:28 PM Updated Updated Apr 12, 2024 | 6:28 PM

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నిఖార్సయిన పేస్​ బౌలింగ్​తో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్​ను కకావికలం చేశాడు.

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నిఖార్సయిన పేస్​ బౌలింగ్​తో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్​ను కకావికలం చేశాడు.

  • Published Apr 12, 2024 | 6:28 PMUpdated Apr 12, 2024 | 6:28 PM
Jasprit Bumrah: వీడియో: లైవ్​లో ఇది చూసుండరు.. బుమ్రా విలువేంటో చెప్పే సీన్ ఇది!

జస్​ప్రీత్ బుమ్రా.. ఈ పేరు వింటే టాప్ బ్యాటర్స్ కూడా వణుకుతారు. అతడి బౌలింగ్​ను ఎదుర్కోలేక బ్యాట్లు ఎత్తేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. యార్కర్లు, ఇన్​స్వింగ్, ఔట్​స్వింగ్, బౌన్సర్, స్లో డెలివరీస్, రివర్స్ స్వింగ్.. ఇలా అతడి అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలెన్నో. బుమ్రా గనుక బంతి పట్టుకొని బౌలింగ్​కు దిగాడా ఎంతటి బ్యాటర్​కైనా చెమటలు పట్టాల్సిందే. ఇదే ఆర్సీబీతో నిన్నటి మ్యాచ్​లోనూ రిపీట్ అయింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సహా బెంగళూరు బ్యాటర్లను బెంబేలెత్తించాడీ పేసుగుర్రం. బ్యాటింగ్​కు సహకరించే పిచ్ మీద 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డును దక్కించుకున్నాడు బుమ్రా. దీంతో అందరూ అతడ్ని అభినందిస్తున్నారు. అయితే నిన్నటి మ్యాచ్​లో లైవ్​లో చాలా మంది ఆడియెన్స్ ఓ బ్యూటిఫుల్ మూమెంట్​ను మిస్సయ్యారు.

బ్యాటింగ్​కు అనుకూలించే పిచ్ మీద నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా చెలరేగడాన్ని చూసి అందరూ షాకయ్యారు. టీ20 మ్యాచ్​లో ఫ్లాట్ వికెట్​లో ఇలాంటి బౌలింగ్​ను ఎవ్వరూ ఎక్స్​పెక్ట్ చేయలేదు. అతడి బౌలింగ్ స్పెల్​ను చూస్తూ ఉండిపోయారు అభిమానులు. అయితే ఈ మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా బుమ్రాను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. అంతేగాక అద్భుతమైన ప్రదర్శనకు గానూ బుమ్రా ముందు తల వంచి నమస్కరించాడు సిరాజ్. నీ బౌలింగ్ సూపర్బ్ అంటూ అభినందించాడు. ఈ ఊహించని చర్యకు షాకైన బుమ్రా.. వెంటనే తేరుకొని అతడ్ని హగ్ చేసుకున్నాడు. ఆ సమయంలో ముంబై-ఆర్సీబీ ప్లేయర్లు అంతా అక్కడే ఉన్నారు.

బుమ్రాను సిరాజ్ గౌరవించిన తీరు, అభినందించిన విధానం మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ ఒక్క సీన్​తో బుమ్రా విలువ ఏంటో చెప్పొచ్చని అంటున్నారు. వరల్డ్ క్రికెట్​లో అతడ్ని మించిన పేసర్ లేడని కామెంట్స్ చేస్తున్నారు. బుమ్రాతో కలసి టీమిండియాకు ఆడుతున్నప్పటికీ, తాను కూడా స్టార్ బౌలరే అయినప్పటికీ ఎలాంటి ఈగో లేకుండా అతడ్ని సిరాజ్ ప్రశంసించిన తీరు అద్భుతమని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఫ్రెండ్​షిప్ బాండ్ ఎంత స్ట్రాంగ్​గా ఉందో చెప్పేందుకు ఈ సీన్ ఒక ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ఇక, ఆర్సీబీ మీద 5 వికెట్లు తీసిన బుమ్రా.. మొత్తంగా ఐదు మ్యాచుల్లో 10 వికెట్లతో పర్పుల్ క్యాప్​ హోల్డర్​గా ఉన్నాడు. మరి.. బుమ్రాను సిరాజ్ మెచ్చుకున్న తీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet