SNP
SRH, IPL 2024, Cricket News: ఐపీఎల్లో అతి భారీ స్కోర్లు చేసే బీస్ట్ టీమ్‌గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రెండు మ్యాచ్‌ల్లో చెత్త బ్యాటింగ్‌తో ఓటమి పాలైంది. దీంతో.. ఎస్ఆర్హెచ్కు ఏమైందంటే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క తప్పుతో ఈ ఓటములు ఎదురవుతున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SRH, IPL 2024, Cricket News: ఐపీఎల్లో అతి భారీ స్కోర్లు చేసే బీస్ట్ టీమ్‌గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రెండు మ్యాచ్‌ల్లో చెత్త బ్యాటింగ్‌తో ఓటమి పాలైంది. దీంతో.. ఎస్ఆర్హెచ్కు ఏమైందంటే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క తప్పుతో ఈ ఓటములు ఎదురవుతున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో ప్రత్యర్థి టీమ్స్‌ను భయపెట్టిన టీమ్ ఏదైనా ఉందంటే.. అది కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాదే. తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటే అన్ని జట్ల బౌలర్లు వణికిపోయేలా చేసింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వీరు బాదుడు.. ఈ టోర్నీకే హైలెట్‌గా మారింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కనీసం కలలో కూడా ఎవరూ కనీవినీ ఎరుగని విధంగా రికార్డులు బద్దలు అయ్యాయి. 20 ఓవర్లలో 287 పరుగులు కొట్టి.. ఐపీఎల్లో కొత్త చరిత్ర లిఖించింది. పవర్ ప్లే 6 ఓవర్లలో ఏకంగా 125 పరుగులు చేసి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా ఐపీఎల్లో ఒక ఏనుగులా ప్రత్యర్థులను తొక్కుకుంటూ వెళ్లింది. కానీ, ఒక్కసారిగా పులి లాంటి ఎస్ఆర్హెచ్ పసికూనలా మారిపోయింది. మరి ఈ మార్పుకు కారణం ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బలం ఏంటంటే.. ఈ సీజన్లో వారి ఆట చూసిన వారెవరైనా బ్యాటింగ్ అనే చెప్తారు. కానీ, వారి బౌలింగ్ ఎటాక్ కూడా సాధారణంగా లేదు. భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్, టీ నటరాజన్, జయదేవ్ ఉనద్కట్ ఇలా అంతా వరల్డ్ క్లాస్ బౌలర్లే ఉన్నారు. వారు వారి స్థాయికి తగ్గట్లు రాణిస్తున్నారు. కానీ, ఎస్ఆర్హెచ్ ఎక్కువగా బ్యాటింగ్‌పైనే ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ.. ముఖ్యంగా టాపార్డర్‌పైనే ఎస్ఆర్హెచ్ ఎక్కువగా ఆధారపడుతోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఈ ముగ్గురిపైనే ఎస్ఆర్హెచ్ ఎక్కువగా ఆధారపడుతోంది. వారు ముగ్గురు సక్సెస్ అయితే.. టీమ్ స్కోర్ ఈజీగా 200 దాటి పోతుంది. కానీ, వారు ముగ్గురు టైమ్ బ్యాడ్ అయి విఫలం అయితే.. ఎస్ఆర్హెచ్ ఒక పసికూన టీమ్‌లా మారిపోతుంది.
ఆర్సీబీతో మ్యాచ్‌లో 207 పరుగులు ఛేజ్ చేయలేక 171 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 213 రన్స్‌ను ఛేదించే క్రమంలో 134 పరుగులకే కుప్పకూలింది. ఎడెన్ మార్కరమ్‌తో పాటు ఇతర బ్యాటర్లు ఆ ముగ్గురికి సపోర్టింగ్ రోల్స్‌గా ఉంటున్నారు తప్పితే.. వారు విఫలమైన సమయంలో టీమ్‌ను ఆదుకోలేకపోతున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే హెడ్, అభిషేక్, క్లాసెన్ మాత్రమే అనే ముద్ర పడిపోతుంది. ఈ ముగ్గురు మంచి ప్లాట్ ఫామ్ సెట్ చేస్తే.. మార్కరమ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి ఫ్రీగా ఆడి రన్స్ చేస్తున్నారు కానీ, ఒత్తిడిలో ఆడలేకపోతున్నారు. ఇదే ఎస్ఆర్హెచ్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ముగ్గురు ఆటగాళ్లపై ఎక్కువ ఆధారపడటం ఎస్ఆర్హెచ్కు నష్టం చేస్తోంది. ఈ లోపాన్ని ఎంత త్వరగా అధిగమించి ఎస్ఆర్హెచ్ ముందుగు సాగితేనే.. ఈ సీజన్లో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MATHEESHA PATHIRANA UPROOTING THE MIDDLE STUMP. 🥵💥 pic.twitter.com/PgVFfdcjk0
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2024