iDreamPost
android-app
ios-app

IPL మధ్యలోనే దుబాయ్​కు కమిన్స్.. SRH కెప్టెన్ మాస్టర్​ ప్లాన్!​

  • Published May 10, 2024 | 2:44 PM Updated Updated May 10, 2024 | 2:44 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ మధ్యలో నుంచి దుబాయ్​కు వెళ్లిపోయాడు. అయితే దీని వెనుక కమిన్స్ మాస్టర్ ప్లాన్ ఉంది.

సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ మధ్యలో నుంచి దుబాయ్​కు వెళ్లిపోయాడు. అయితే దీని వెనుక కమిన్స్ మాస్టర్ ప్లాన్ ఉంది.

  • Published May 10, 2024 | 2:44 PMUpdated May 10, 2024 | 2:44 PM
IPL మధ్యలోనే దుబాయ్​కు కమిన్స్.. SRH కెప్టెన్ మాస్టర్​ ప్లాన్!​

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో వరుస విజయాలతో ప్రత్యర్థులను భయపెట్టింది సన్​రైజర్స్ హైదరాబాద్. అయితే సెకండాఫ్​లో మాత్రం అదే జోరును కంటిన్యూ చేయలేకపోయింది. బౌలర్లు ఫర్వాలేదనిపించినా బ్యాటర్లు తడబడటం టీమ్​ను ఇబ్బంది పెట్టింది. పోయిన మూమెంటమ్​ను​ తిరిగి అందుకునేందుకు చాలా సమయం పట్టింది. మొత్తానికి కమ్​బ్యాక్ ఇచ్చిన ఆరెంజ్ ఆర్మీ గత మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచుల్లో ఏడింట్లో నెగ్గిన ఎస్​ఆర్​హెచ్.. 14 పాయింట్లతో థర్డ్ పొజిషన్​లో ఉంది. తదుపరి ఆడే రెండు మ్యాచుల్లో ఒకదాంట్లో గెలిస్తే ప్లేఆఫ్స్​కు చేరుతుంది. ఈ తరుణంలో లీగ్ మధ్యలో నుంచి దుబాయ్​కు వెళ్లిపోయాడు కమిన్స్.

సన్​రైజర్స్ సారథి కమిన్స్ ఐపీఎల్ మధ్యలో నుంచి దుబాయ్​కు పయనమయ్యాడు. కమిన్స్ మాత్రమే కాదు.. హెన్రిచ్ క్లాసెన్ సహా పలువురు ఇతర ఆటగాళ్లు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అయితే ఇలా వెళ్లడం వెనుక కమిన్స్ మాస్టర్​ప్లాన్ ఉంది. గత కొన్ని వారాలుగా అలుపెరుగని క్రికెట్​తో ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు బాగా అలసిపోయారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్​కు సమయం దగ్గర పడుతోంది. ఇంకొన్ని రోజుల్లో ప్లేఆఫ్స్ సమరం మొదలుకానుంది. దీనికి ముందు ప్లేయర్లు ఫ్రెష్​గా ఉండాలి. ఎస్​ఆర్​హెచ్ ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే. నెక్స్ట్ ఆడే రెండు మ్యాచుల్లో ఒకదాంట్లో నెగ్గినా సరిపోతుంది. ఒకవేళ రెండింట్లోనూ ఓడినా నెట్ రన్ రేట్ అద్భుతంగా ఉంది. కాబట్టి క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్లేఆఫ్స్ ముందు ప్లేయర్లు మరింత తాజాగా, ఉత్సాహంగా, జోష్​తో ఉండాలనే ఉద్దేశంతో రెస్ట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని సన్​రైజర్స్ మేనేజ్​మెంట్ తీసుకుందని తెలుస్తోంది. కెప్టెన్ కమిన్స్ సూచన మేరకే ఈ డిసిషన్ తీసుకున్నారని వినిపిస్తోంది. వెకేషన్​లో విశ్రాంతి తీసుకుంటూ, కుటుంబాలతో సమయాన్ని గడుపుతూ ఆటగాళ్లు సేదతీరి మళ్లీ ఫ్రెష్​గా లీగ్​లోకి అడుగుపెట్టాలనేదే మేనేజ్​మెంట్ ప్లాన్ అని సమాచారం. సన్​రైజర్స్ తర్వాతి మ్యాచ్ మే 16వ తేదీన ఉంది. కాబట్టి ఈ టైమ్​ను విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారని తెలిసింది. మరి.. కమిన్స్, ఎస్​ఆర్​హెచ్ మేనేజ్​మెంట్ వేసిన ప్లాన్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.