iDreamPost
android-app
ios-app

హను రాఘవపూడి డైరెక్షన్ లో శ్రీలీల! సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేశారుగా..

  • Published Jun 07, 2024 | 9:48 PM Updated Updated Jun 07, 2024 | 9:48 PM

యంగ్ హీరోయిన్ శ్రీలీల లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. పైగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేసినట్లుగా సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

యంగ్ హీరోయిన్ శ్రీలీల లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. పైగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేసినట్లుగా సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

హను రాఘవపూడి డైరెక్షన్ లో శ్రీలీల! సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేశారుగా..

శ్రీలీల.. ‘గుంటూరు కారం’ మూవీ తర్వాత సైలెంట్ అయిపోయింది ఈ బ్యూటీ. ఈ మూవీ కంటే ముందు ఇండస్ట్రీనీ ఓ రేంజ్ లో షేక్ చేసింది. ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలను ఒప్పుకుని.. శ్రీలీల అంటే టాలీవుడ్, టాలీవుడ్ అంటే శ్రీలీల అన్నట్లుగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె వరుసగా చేసిన మూవీలు ఆశించిన ఫలితాను ఇవ్వలేదు. దాంతో కాస్త బ్రేక్ తీసుకుని తన చదువుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారాయి. పైగా స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది శ్రీలీల. మరోవైపు ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసే పనిలో కూడా పడినట్లు తెలుస్తోంది. ఒకవైపు కథలు వింటూనే తన చదువును కొనసాగిస్తోంది. అందుకే సినిమాల వేగం తగ్గించినట్లు వినికిడి. అయితే ఇప్పటి వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు ఈ అమ్మడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా శ్రీలీల షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలీల నటించింది. ఆ ఫొటోలను తాజాగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే. ఇది సినిమా కాదు.. ఓ యాడ్ షూట్ లో భాగంగా శ్రీలీల పల్లెటూరి అమ్మాయిలా, పాత తరం హీరోయిన్ లా మారిపోయింది. రెట్రో లుక్ లో ఈ చిన్నది మెస్మరైజ్ చేసింది. “రెట్రో లుక్స్  హత్తుకున్నాయి, డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో నేను కొత్తగా కనిపించాను. ఇదొక యాడ్ షూట్. నన్ను ఇంత అందంగా చూపించిన హను రాఘవపూడికి థ్యాంక్స్” అని ఆ పిక్స్ కింద రాసుకొచ్చింది శ్రీలీల. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş