iDreamPost
android-app
ios-app

శ్రీలీల కెరీర్ క్లోజ్ అన్నారు.. స్టార్ హీరోతో క్రేజీ ప్రాజెక్టుతో వచ్చేస్తోంది!

Sreeleela In Star Hero Movie: టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కెరీర్ ప్రశ్నార్థకం అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ, ఈ అమ్మడు ఇప్పుడు ఓ స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతోంది.

Sreeleela In Star Hero Movie: టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కెరీర్ ప్రశ్నార్థకం అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ, ఈ అమ్మడు ఇప్పుడు ఓ స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతోంది.

శ్రీలీల కెరీర్ క్లోజ్ అన్నారు.. స్టార్ హీరోతో క్రేజీ ప్రాజెక్టుతో వచ్చేస్తోంది!

శ్రీలీల.. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో హ్యూజ్ ఫ్యాన్, చేతినిండా సినిమాలతో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. నిజానికి అతి చిన్న వయసులోనే స్టార్ హీరోస్ తో అదిరిపోయే మూవీస్ చేసింది. ముఖ్యంగా శ్రీలీల స్టెప్పులకు హేమాహేమీలు కూడా నోరెళ్లబెట్టే పరిస్థితి. శ్రీలీల ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్టులతో దూసుకుపోయింది. కానీ, కొన్ని సినిమాల తర్వాత వాటిలో కొన్ని మూవీస్ కి ఆశించిన ఫలితాలు రాలేదు. ఇంకేముంది.. శ్రీలీల కెరీర్ క్లోజ్.. ఆమెకు ఇంక అవకాశాలు రావు అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు. తను ఇంక హీరోయిన్ గా కొనసాగడం కష్టం అంటూ కామెంట్స్ చేశారు. కానీ, ఇప్పుడు ఆమె ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతోందని తెలుస్తోంది.

తెలుగులో చిత్రాంగధ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శ్రీలీల.. తొలుత కన్నడ సినిమాల్లో కనిపించింది. తెలుగులో శ్రీకాంత్ కుమారుడు పెళ్లి సందడి మూవీతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె యాక్టింగ్, డాన్స్ కి తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆమెకు చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఊపిరి సలపనంత బిజీగా గడిపేసింది. అయితే ఆమె చేసిన ప్రాజెక్ట్స్ లో చాలా వరకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇంకేముంది ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేసేశారు.

Sri leela

నిజానికి ఆమె లుక్స్ బాగున్నాయని.. డాన్స్ బాగా వేస్తోందని మూవీలో పెట్టుకుని.. ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అంటూ ఫ్యాన్స్ ప్రచారాలు స్టార్ట్ చేశారు. ఇంకేముంది ఆమె కెరీర్ క్లోజ్ అంటూ ఇండస్ట్రీలో టాక్ స్టార్ట్ చేశారు. ఇలాంటి తరుణంలో ఏ హీరోయిన్ అయినా కుంగి పోతుంది. కానీ, చిన్న వయసులో కూడా శ్రీలీల ఎంతో మనో నిబ్బరంతో ఉంది. ఇంకేముంది ఇప్పుడు ఒక క్రేజా వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అది కూడా శ్రీలీల కెరీర్ కి సంబంధించి. అదేంటంటే.. ఓ స్టార్ హీరోతో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో రాబోతోందంట. ఆ హీరో మరెవరో కాదు.. అజిత్. అవును అజిత్ ఇటీవల ప్రకటించిన.. గుడ్- బ్యాడ్- అగ్లీ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోందని తెలుస్తోంది.

అజిత్ కుమార్ కెరీర్ స్పెషల్ ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాలో శ్రీలీల నటిస్తోందని తెలిశాక ఆమె ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ మూవీని తీస్తున్నట్లు చెప్తున్నారు. శ్రీలీల ప్రస్తుతం కెరీర్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా స్టోరీ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సరైన ఎంపిక అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ కాస్త వైలెంట్ గానే ఉండేలా కనిపిస్తోంది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş