Somesekhar
ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల హాల్ సాధించిన కుల్దీప్ యాదవ్ పై కాసుల వర్షం కురిసింది. వికెట్ కు లక్ష చొప్పున అతడికి 5 లక్షలు లభించనున్నాయి. ఎందుకో తెలుసా?
ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల హాల్ సాధించిన కుల్దీప్ యాదవ్ పై కాసుల వర్షం కురిసింది. వికెట్ కు లక్ష చొప్పున అతడికి 5 లక్షలు లభించనున్నాయి. ఎందుకో తెలుసా?
Somesekhar
ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో ఇంగ్లండ్ ను చాపలా చుట్టేశాడు చైనా మన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. గింగిరాలు తిరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి పెవిలియన్ కు చేర్చాడు. తన మ్యాజికల్ స్పెల్ తో 5 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న భారత బౌలర్ గా నిలిచాడు. అయితే కుల్దీప్ తీసిన ప్రతీ వికెట్ కు రూ. లక్ష రూపాయలు వస్తాయి. ఎందుకంటే?
కుల్దీప్ యాదవ్.. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. కుల్దీప్ 1871 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్ట్ లో 5 వికెట్ల తీసిన కుల్దీప్ పై కాసుల వర్షం కురిసింది. కేవలం 12వ టెస్ట్ లోనే నాలుగోసారి ఐదు వికెట్ల హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు చైనా మన్ బౌలర్. ఈ క్రమంలోనే 5 వికెట్లు తీసిన కుల్దీప్ కు బీసీసీఐ నుంచి బంపర్ గిఫ్ట్ లభించింది. అతడు తీసిన ఒక్కో వికెట్ కు రూ. లక్ష చొప్పున బీసీసీఐ చెల్లించనుంది. దానికి కారణం ఏంటంటే?
ఓ ఆటగాడు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టినప్పుడు మ్యాచ్ ఫీజుతో పాటుగా రూ. 5 లక్షలను బోనస్ గా అందజేస్తుంది బీసీసీఐ. ఈ రూల్ ను బీసీసీఐ తీసుకొచ్చింది. దీంతో కుల్దీప్ తీసిన ఒక్కో వికెట్ కు రూ. లక్ష రూపాయాలు లభించనున్నాయి. బౌలింగ్ లోనే కాదు.. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లోనూ ఇరగదీస్తున్నాడు కుల్దీప్. 55 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 27 పరుగులు చేసి అజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బుమ్రాతో కలిసి 9వ వికెట్ 108 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదీకాక కీలకమైన నాలుగో టెస్ట్ లో సైతం వందకు పైగా బాల్స్ ఎదుర్కొని ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గించి, జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరి ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్న కుల్దీప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: వందో టెస్ట్.. చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్న అశ్విన్!