iDreamPost

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్.. అదేంటంటే?

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా. సొంత ఊళ్లకు వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైలు ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా. సొంత ఊళ్లకు వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైలు ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్.. అదేంటంటే?

మరికొన్ని రోజుల్లో సంక్రాంత్రి పండగ రానుంది. పది రోజుల ముందుగానే సంక్రాంతి సందడి మొదలైంది. పండగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ కు సెలవులు కూడా ప్రకటించాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటిల్లిపాది ఆనందంగా గడిపేందుకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మూడు రోజుల పాటు సందడిగా సాగే ఈ పండగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య ఘననీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారు సంక్రాంతి పండగకు ఊరెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రైలు ప్రయాణికులకు మరో శుభవార్తను అందించింది రైల్వే శాఖ. మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా ప్రకటించింది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ – కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

04 ప్రత్యేక రైళ్ల వివరాలు:

ప్రత్యేక రైలు నెం.07021 జనవరి 11న రాత్రి 09 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.00 గం.లకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. అలాగే కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం.07022 జనవరి 12వ తేదీన సాయంత్రం 05.40 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.55 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే ప్రత్యేక రైలు నెం.07023 జనవరి 12న సాయంత్రం 06.30 గం.లకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గం.లకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం. 07024 జనవరి 13న రాత్రి 10.00 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే:

సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

అలాగే హైదరాబాద్ – కాకినాడ టౌన్ మధ్య నడిచే రెండు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట సంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

32 ప్రత్యేక రైళ్ల వివరాలు:

ట్రైన్ నెంబర్ 07089 సికింద్రాబాద్‌- బ్రహ్మపుర్‌ – జనవరి 7, 14 తేదీలు
ట్రైన్ నెంబర్ 07090 బ్రహ్మపుర్‌ – వికారాబాద్ – జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07091 వికారాబాద్- బ్రహ్మపుర్‌ – జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07092 బ్రహ్మపుర్‌ – సికింద్రాబాద్ – జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 08541 విశాఖ – కర్నూలు సిటీ – జనవరి 10, 17, 24 తేదీలు
ట్రైన్ నెంబర్ 08542 కర్నూలు సిటీ – విశాఖ – జనవరి 11, 18, 25 తేదీలు
ట్రైన్ నెంబర్ 08547 శ్రీకాకుళం – వికారాబాద్ – జనవరి 12, 19, 26 తేదీలు
ట్రైన్ నెంబర్ 08548 వికారాబాద్ – శ్రీకాకుళం – జనవరి 13, 20, 27 తేదీలు
ట్రైన్ నెంబర్ 02764 సికింద్రాబాద్ – తిరుపతి – జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 02763 తిరుపతి – సికింద్రాబాద్ – జనవరి 11, 18 తేదీలు
ట్రైన్ నెంబర్ 07271 సికింద్రాబాద్ – కాకినాడ – జనవరి 12 తేదీ
ట్రైన్ నెంబర్ 07272 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ – జనవరి 13 తేదీ
ట్రైన్ నెంబర్ 07093 సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ – జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07094 బ్రహ్మపూర్ – సికింద్రాబాద్ – జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07251 నర్సాపూర్ – సికింద్రాబాద్ – జనవరి 10 తేదీ
ట్రైన్ నెంబర్ 07052 సికింద్రాబాద్ – నర్సాపూర్ – జనవరి 11 తేదీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి