iDreamPost

రైల్వే శాఖ హెచ్చరిక.. ప్లాట్ ఫామ్ పై అలా చేస్తే ఇక జైలుకే!

South Central Railway Warning: దక్షిణ మధ్య రైల్వేస్ వారి ప్రయాణికులకు కొత్త హెచ్చరికలు జారీ చేసింది. ఈ సూచనలు పాటించకపోతే రూ.1000 జరిమానా మాత్రమే కాకుండా 6 నెలలు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.

South Central Railway Warning: దక్షిణ మధ్య రైల్వేస్ వారి ప్రయాణికులకు కొత్త హెచ్చరికలు జారీ చేసింది. ఈ సూచనలు పాటించకపోతే రూ.1000 జరిమానా మాత్రమే కాకుండా 6 నెలలు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.

రైల్వే శాఖ హెచ్చరిక.. ప్లాట్ ఫామ్ పై అలా చేస్తే ఇక జైలుకే!

దేశంలో ఉన్న అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ ఏది అంటే రైల్వేస్ అనే చెప్పాలి. రోజుకి లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది. అలాంటి ఒక పెద్ద వ్యవస్థను నడిపించాలంటే కత్తి మీద సాములాంటిదనే చెప్పాలి. అలాంటి వారికి కొందరి ఆకతాయిలు, తుంటరి పనులు చేసే వారితో కొత్త తలనొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఇన్నాళ్లు నచ్చజెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఈసారి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైపోయింది. రూ.వెయ్యి రూపాయల జరిమానాతో పాటుగా.. 6 నెలల జైలుశిక్ష కూడా విధించనున్నారు. అసలు ఆ పనులు ఏంటి? దక్షిణ మధ్య రైల్వే అంత సీరియస్ ఎందుకు అయ్యిందో చూద్దాం.

ఇప్పుడున్న యువత అయిన దానికి కాని దానికి సెల్ఫీలు తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఆ అలవాటు కాస్తా ఇప్పుడు వ్యసనంగా మారిపోయింది. సాధారణంగానే రోజులో సెల్ఫీ అయినా తీసుకోకపోతే నిద్రపట్టని వాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్లు రైలు ప్రయాణం అనగానే ఫోన్ కి ఫుల్ ఛార్జ్ పెట్టుకుని స్టేషన్ కి వచ్చేస్తున్నారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మొదలు పెట్టిన సెల్ఫీలు రైలు ఎక్కినా ఆగడం లేదు. అయితే ఈ సెల్ఫీల ఎవరికైనా ఇబ్బందా అంటే.. వారికే ఇబ్బంది. ఇప్పుడు సెల్ఫీల మోజులో పడి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం.

If you do that on the platform, you will go to jail

ఇప్పటికే సెల్ఫీల వల్ల జరిగే ప్రమాదాలు, పోతున్న ప్రాణాలకు సంబంధించి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా చాలామందిలో మార్పు రావడం లేదు. ప్లాట్ ఫామ్ మీద, ఫుట్ బోర్డ్ మీద సెల్ఫీలు దిగడం, రైలు ఎక్కే సమయంలో, ట్రైన్ రన్నింగ్ లో ఉండగా సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తే ఇకపై కఠిన చర్యలు తప్పవు అంటున్నారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు హెచ్చరికలు జారీచేశారు. ఇండియన్ రైల్వే యాక్ట్ 1989 ప్రకారం ఇలాంటి పనులు చేసే వారికి కఠిన శిక్షలు తప్పవు. తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులను హెచ్చరించింది. ప్లాట్ ఫామ్ మీద సెల్ఫీలు తీసుకోవడం, ఫుట్ బోర్డ్ మీద ఉండి సెల్ఫీలు తీసుకోవడం చేయకూడదని చెప్పింది.

అలాగే ట్రైన్ వస్తున్నప్పుడు ముందు నిల్చుని సెల్ఫీసు తీసుకోవడం చేయకూడదని సూచించింది. ఈ వార్త విన్న తర్వాత సెల్ఫీ లవర్స్ అంతా కంగుతింటున్నారు. రైలు ఎక్కే సమయంలో సెల్ఫీ తీసుకోవడం మా బలహీనత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ, ఆ బలహీనతను అధిగమించకపోతే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందే. అలాగే నిషేదిత ప్రాంతంలో రైలు ఎక్కకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్లాట్ ఫామ్ మీద మాత్రమే రైలు ఎక్కాల్సి ఉంటుంది. అలాగే ట్రాక్స్ మీదనుంచి నడవడం కూడా చేయకూడదు. మొత్తానికి సెల్ఫీ లవర్స్ కి షాకిస్తూ దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. మరి.. సెల్ఫీ లవర్స్ కి షాకిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వేస్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి