iDreamPost

Railways: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ గుడ్ న్యూస్. ఇకపై రూ.20కే భోజనం!

  • Published Apr 24, 2024 | 8:30 AMUpdated Apr 24, 2024 | 2:43 PM

రైళ్లలో ప్రయాణించే వారికి భారీ శుభవార్త. వారి కోసం కేవలం 20 రూపాయలకే భోజనం అందించేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

రైళ్లలో ప్రయాణించే వారికి భారీ శుభవార్త. వారి కోసం కేవలం 20 రూపాయలకే భోజనం అందించేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

  • Published Apr 24, 2024 | 8:30 AMUpdated Apr 24, 2024 | 2:43 PM
Railways: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ గుడ్ న్యూస్. ఇకపై  రూ.20కే భోజనం!

దూర ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఇప్పటికి కూడా రైల్వేనే బెస్ట్‌ ఆప్షన్‌. ధర తక్కువ.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం చూసుకునే వారు రైల్వేకే ఓటేస్తారు. బస్‌ టికెట్‌ ధరతో పోలిస్తే.. చాలా తక్కువ ధరకే రైల్వేలో ఏసీ ప్రయాణం చేయవచ్చు. అంతేకాక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిచడం కోసం రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. అనేక పథకాలను ప్రారంభిస్తుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన జర్నీ కల్పించేందుకు అవసరమైన చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే ఆహారాన్ని అందించేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఈ శుభవార్త చెప్పింది. వేసవి కాలం, విద్యార్థులకు సెలవులు లభిస్తుండటంతో.. చాలా మంది దూర ప్రయాణాలు, తీర్థ యాత్రలకు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. దాంతో రైల్లలో భారీగా రద్దీ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారం అందించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది.

కొన్ని రోజుల క్రితం ఇండియన్ రైల్వే, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ను తీసుకువచ్చాయి. ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ఉద్దేశంతోనే రైల్వే శాఖ ఈ ఎకానమీ మీల్స్ తీసుకు వచ్చింది. జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం సరసమైన ధరలో భోజనం అందించేందుకు ఈ విధానం తీసుకువచ్చారు.

దేశవ్యాప్తంగా వందకుపైగా రైల్వే స్టేషన్లలో 150 కేంద్రాల ద్వారా ఈ ఎకానమీ మీల్స్‌ పథకం ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట , గుంతకల్ , తిరుపతి , రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల రైల్వే స్టేషన్‌లలో 18 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్‌ను ప్రయాణికులకు అందించేందుకు రెడీ అవుతుంది రైల్వే శాఖ. ఎకానమీ మీల్స్‌లో భాగంగా రెండు రకాలైన భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి రకంలో కేవలం 20 రూపాయలకే ప్రయాణికులకు ఎకానమీ భోజనం అందించనున్నారు. ఇక రెండోరకంలో 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తారు.

రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీ భోజనం, నీటి ప్యాకెట్లను సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఆగేచోట ఫ్లాట్ ఫారమ్‌లపై అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులు ఈ కౌంటర్ల నుంచి నేరుగా ఈ ఎకానమీ మీల్స్‌ను కొనుగోలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలను గతేడాది 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మద్య రైల్వేలోని 7 స్టేషన్‌లలో ఐఆర్‌సీటీసీ కిచెన్‌ యూనిట్ల ద్వారా ఈ భోజనం అందిస్తున్నారు. రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీ మీల్స్‌పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి